Koffee With Karan లో సెలబ్రిటీ లవ్‌బర్డ్స్

ABN , First Publish Date - 2022-05-12T00:56:07+05:30 IST

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ (karan johar) మే 4న కీలక ప్రకటన చేశాడు. తాను హోస్ట్ చేసే చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) 7వ సీజన్ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ లో స్ట్రీమింగ్ కానుందని

Koffee With Karan లో సెలబ్రిటీ లవ్‌బర్డ్స్

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ (karan johar) మే 4న కీలక ప్రకటన చేశాడు. తాను హోస్ట్ చేసే చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) 7వ సీజన్ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించాడు. ఈ సీజన్‌లో సారా అలీఖాన్ ( Sara Ali Khan) , జాన్వీ కపూర్ (Janhvi Kapoor), ఆలియా భట్ (Alia bhatt), రణ్‌వీర్ సింగ్(Ranveer Singh)తో పాటు సౌత్ సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ సారి షోకు బీ టౌన్ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్‌ను ఆహ్వానించారని తెలుస్తోంది. 


రొమాంటిక్ కఫుల్‌ మలైకా అరోరా (Malaika Arora), అర్జున్ కపూర్ (Arjun Kapoor)ను ఇప్పటికే ‘కాఫీ విత్ కరణ్’ మేకర్స్ సంప్రదించారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అందుకు ఈ జంట అంగీకారం కూడా తెలిపిందని సమాచారం. తాము డేటింగ్ చేస్తున్నామని 2019లో అర్జున్, మలైకా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందరికీ తెలియజేశారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకొబోతున్నారని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వీరు హింట్ కూడా ఇచ్చారు.

Updated Date - 2022-05-12T00:56:07+05:30 IST

Read more