Kiara Advani: రహస్యం చెబుతానంటున్న అందాల భామ

ABN , First Publish Date - 2022-11-28T02:00:22+05:30 IST

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్ననటి కియారా అడ్వాణీ (Kiara Advani). తాజాగా ‘గోవిందా నామ్ మేరా’ (Govinda Naam Mera) లో నటించింది.

Kiara Advani: రహస్యం చెబుతానంటున్న అందాల భామ

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటి కియారా అడ్వాణీ (Kiara Advani). తాజాగా ‘గోవిందా నామ్ మేరా’ (Govinda Naam Mera) లో నటించింది. విక్కీ కౌశల్, భూమి ఫడ్నేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. డిస్నీ+హాట్ స్టార్ వేదికగా డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియాలో కియారా తాజాగా ఓ పోస్ట్‌ను పెట్టింది. వీడియోతో అభిమానులను టీజ్ చేసింది. ఈ వీడియోలో కియారా నవ్వుతూ కెమెరాకు ఫోజులిచ్చింది. ‘‘చాలా కాలం పాటు రహస్యాన్ని దాచలేం. త్వరలోనే ప్రకటిస్తాను. డిసెంబర్ 2 కోసం వేచి ఉండండి’’ అని కియారా ఇన్‌స్టాలో వీడియో కింద క్యాప్షన్ ఇచ్చింది. 

 

కియారా వీడియోను పోస్ట్ చేయగానే నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురింపించారు. సిద్దార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra)ను ఆమె పెళ్లి చేసుకోనుందని పలువురు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ప్రీ వెడ్డింగ్ షూట్’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘సిద్దార్థ్ మల్హోత్రాతో మీ పెళ్లి. ఈ విషయం దేశం మొత్తానికి తెలుసు. కొత్తగా ఏదైనా రహస్యాన్ని బయటపెట్టండి’’ అని మరో నెటిజన్ తెలిపారు. కియారా అడ్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రా కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. కానీ, ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడు బయటపెట్టలేదు. కియారా, సిద్దార్థ్ డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని బీటౌన్ మీడియా తెలుపుతోంది. చండీగఢ్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ జంట వెడ్డింగ్ లోకేషన్స్ కోసం కొంతకాలంగా అన్వేషిస్తున్నారట. కియారా, సిద్దార్థ్ గతంలో ‘షేర్ షా’ (Shershaah) లో నటించారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల అయింది. కొన్ని వారాల పాటు అనేక దేశాల్లో ట్రెండ్ అయింది. ఇక కియారా అడ్వాణీ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. కార్తిక్ ఆర్యన్‌కు జోడీగా ‘సత్య ప్రేమ్ కహానీ’ లో నటిస్తుంది. రామ్ చరణ్‌ ‘ఆర్‌సీ15’ (RC15) లో హీరోయిన్ పాత్రను పోషిస్తుంది. 



Updated Date - 2022-11-28T02:00:22+05:30 IST