Kiara Advani: నీ చేతులకి ఏమైందంటూ.. కియారాపై విపరీతంగా ట్రోలింగ్
ABN , First Publish Date - 2022-08-17T15:00:26+05:30 IST
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా చేసిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటి కియారా అడ్వాణీ (Kiara Advani)...

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా చేసిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటి కియారా అడ్వాణీ (Kiara Advani). వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్(Bollywood)లో క్రేజీ హీరోయిన్గా మారిపోయిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లోనూ క్రేజీ మూవీస్‌లో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షూటింగ్ కోసం వెళుతూ ముంబైలో మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అందులో.. కారులో నుంచి దిగిన కియారా నడుచుకుంటూ షూటింగ్ స్పాట్‌కి వెళుతోంది. అయితే ఆ సమయంలో వర్షం పడుతుండడంతో ఈ భామ బాడీగార్డ్ నటి తడవకుండా గొడుగు పట్టాడు. అది నెటిజన్ల కోపానికి కారణమైంది. దాంతో ఈ తారని ట్రోల్(Troll) చేయడం ప్రారంభించారు. ‘కియారా గొడుకు పట్టుకోవచ్చు కదా’ అని కొందరూ.. ‘ఆమె చేతులకి ఏమైంది.. గొడుగుపట్టుకోలేదా’ అంటూ మరికొందరూ.. ‘సెక్యూరిటీ గార్డుకి గొడుగు అవసరం లేదా’ అంటూ ఇంకొందరూ.. కియారాని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.