Ketki Dave: ఈ నటి భర్త చనిపోయి రెండు రోజులయింది.. మూడో రోజు ఈమె ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2022-08-07T01:01:44+05:30 IST
టెలివిజ్ షోలు, హిందీ, గుజరాతీ సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్న నటి కేత్కి దవే (Ketki Dave). ఆమె భర్త రసిక్ దవే(Rasik Dave) తాజాగా మరణించాడు. రసిక్ నాలుగేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో

టెలివిజ్ షోలు, హిందీ, గుజరాతీ సినిమాలతో ఫేమ్ సంపాదించుకున్న నటి కేత్కి దవే (Ketki Dave). ఆమె భర్త రసిక్ దవే(Rasik Dave) తాజాగా మరణించాడు. రసిక్ నాలుగేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతు 65ఏళ్ల వయసులో మృతి చెందాడు. తన భర్త మరణించిన రెండు రోజులకే తాను పనిని ప్రారంభించినట్టు కేత్కి చెప్పింది.
కేత్కి తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. భర్త మృతి చెందినప్పటికీ ఆమె ఎటువంటి బ్రేక్ తీసుకోలేదని చెప్పింది. రెండు రోజులకే పనిని ప్రారంభించినట్టు పేర్కొంది. తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదనే ఈ విధంగా చేసినట్టు వెల్లడించింది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని కలపి చూడకూడదని స్పష్టం చేసింది. ‘‘ప్రాజెక్టులో నేను మాత్రమే ఉండను. బృందంగా అందరు కలసి పనిచేస్తారు. షోలు కొన్ని ముందుగానే బుక్ అయ్యాయి. అందువల్ల ఎవరు నా వల్ల ఇబ్బంది పడకూడదు’’ అని కేత్కి దవే చెప్పింది. ఆమె గతంలోను మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. రసిక్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంది. ‘‘అనారోగ్యం గురించి రసిక్ నాకు ఎప్పుడు చెప్పలేదు. అతడు త్వరగానే కోలుకుని పనిలోకి వెళ్తాడని భావించాడు. నేను రసిక్‌ను మొదటిసారిగా 1979లో సెట్‌లో కలుసుకున్నాను. అనంతరం ప్రేమించుకుని 1983లో పెళ్లి చేసుకున్నాం. రసిక్ అద్బుతమైన మనిషి. జీవితంలోని ఎత్తుపల్లాలను ధైర్యంగా ఎదుర్కొనేవాడు’’ అని కేత్కి వెల్లడించింది. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. ‘బాలికా వధు’ (Balika Vadhu)), ‘క్యోంకీ సాస్ బీ కబీ బహు తీ’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) తదితర సీరియల్స్‌తో ఫేమ్ సంపాదించుకుంది.