Katrina Kaif and Vicky Kaushal: రహస్య వివాహానికి కారణం ఇదే.. అసలు నిజం చెప్పేసిన కత్రినా
ABN , First Publish Date - 2022-09-01T15:35:31+05:30 IST
బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో కత్రినా కైఫ్ (Katrina Kaif), విక్కీ కౌశల్ (Vicky Kaushal) జంట ఒకటి. గతేడాది డిసెంబర్లో కుటుంబసభ్యులు..
బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో కత్రినా కైఫ్ (Katrina Kaif), విక్కీ కౌశల్ (Vicky Kaushal) జంట ఒకటి. గతేడాది డిసెంబర్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య చాలా రహస్యంగా ఈ జంట వివాహం (Wedding) చేసుకుంది. అనంతరం సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలను కత్రినా షేర్ చేయడంతో అప్పటి వరకూ ఉన్న అనుమానాలే నిజమని కన్ఫామ్ అయిపోయింది. గ్రాండ్ వెడ్డింగ్ జరిగిన దాదాపు ఏడాది కావొస్తుంది. ఇప్పటివరకూ సీక్రెట్ వెడ్డింగ్ గురించి ఈ జంట మాట్లాడలేదు. కానీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ రహస్య వివాహానికి కారణాన్ని కత్రినా వెల్లడించింది.
ఇటీవల జరిగిన ఫిల్మ్‌ఫేర్ (FilmFare) అవార్డుల కార్యక్రమానికి భర్త విక్కీ కౌశల్‌తో కలిసి కత్రినా కైఫ్ హాజరైంది. ఇందులో.. ‘సర్ధార్ ఉదమ్ సింగ్’ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడు (క్రిటిక్స్) విభాగంలో విక్కీ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా కత్రినా మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము మా పెళ్లిని సీక్రెట్‌గా ఉంచడానికి ప్రధాన కారణం కోవిడ్ 19. అప్పటి పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నా కుటుంబ సభ్యులు కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారు. మా నుంచి ఎవరికీ పాకకూడదనే ఉద్దేశంతోనే అలా చేశాం.
అప్పటి కంటే ఈ సంవత్సరం పరిస్థితులు కొంచెం మెరుగ్గా ఉన్నాయని నేను భావిస్తున్నాను. కానీ.. అ సమయంలో నిజంగా కోవిడ్‌తో జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాం. అయితే.. వివాహం మాత్రం చాలా గ్రాండ్‌గా, అందంగా జరిగింది. మేము ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది.
కాగా.. కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘టైగర్ 3’, సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌తో కలిసి హారర్ కామెడీ 'ఫోన్ భూత్', తమిళ నటుడు విజయ్ సేతుపతి ‘మెర్రీ క్రిస్మస్’ అనే సినిమాలు చేస్తూ కెరీర్లో చాలా బిజీగా ఉంది. అలాగే.. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ‘జీ లే జరా’ అనే చిత్రంలో ప్రియాంక చోప్రా, అలియాభట్‌తో కలిసి నటించనుంది.