సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Katrina Kaif గర్భవతి అయిందా..? Vicky Kaushal తండ్రి కాబోతున్నాడా..?

ABN, First Publish Date - 2022-05-13T16:54:03+05:30

బాలీవుడ్ స్టార్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గత ఏడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఫోర్ట్ ప్యాలెస్‌లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గత ఏడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఫోర్ట్ ప్యాలెస్‌లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమ కెరీర్ మీద కాన్‌సన్‌ట్రేట్ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా ఈ జంట వేకేషన్‌కి వెళుతోంది. అలాగే.. పండుగల సమయంలో ఒకరితో ఒకరి సమయాన్ని గడపడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాగే.. వీరికి సంబంధించిన పిక్స్‌ని సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ జంట ప్రస్తుతం న్యూయార్క్‌లో వేకేషన్‌ని ఎంజాయ్ చేస్తోంది.


ఈ తరుణంలో ఈ కపుల్ గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కత్రిన ప్రస్తుతం రెండు నెలల గర్భవతి అని ఆ వార్తా సారాంశం. తండ్రి కాబోతున్నందుకు విక్కీ ఎంతో సంతోషంగా ఉన్నాడట. వారి కుటుంబం మొత్తం ఫ్యామిలీలోకి కొత్త మెంబర్‌ని ఆహ్వానించడానికి సిద్ధమవుతోందని సమాచారం. అయితే.. ఈ విషయంపై కత్రిన, విక్కీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. మరో నెల తర్వాత అంటే మూడోనెలలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అప్పటి వరకూ ఈ విషయంపై సస్పెన్స్ అలాగే కొనసాగనుంది.

Updated Date - 2022-05-13T16:54:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!