సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kartik Aaryan: కోట్లిచ్చినా కెమెరా ముందుకు రానంటున్న బాలీవుడ్ హీరో

ABN, First Publish Date - 2022-08-29T21:23:13+05:30

బాలీవుడ్‌లో గాడ్ ఫాదర్ అనేది లేకుండా స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’ (Sonu Ke Titu Ki Sweety), ‘పతి, పత్నీ ఔర్ వో’ (Pati Patni Aur

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో గాడ్ ఫాదర్ అనేది లేకుండా స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’ (Sonu Ke Titu Ki Sweety), ‘పతి, పత్నీ ఔర్ వో’ (Pati Patni Aur Woh) చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ‘భూల్ భూలయ్యా-2’ లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వసూళ్ల సునామీని కురిపించింది. ఈ మూవీ విజయంతో కార్తిక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో నిర్మాతలతో పాటు పలు కంపెనీల ప్రతినిధులు అతడి క్రేజ్‌ను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా ఓ కంపెనీ పాన్ మసాలా యాడ్‌లో నటించమని కార్తిక్‌ను అడిగింది. రూ.9కోట్లను ఆఫర్ చేసింది. అయినప్పటికి, ఆ యాడ్‌ను చేసేందుకు కార్తిక్ మాత్రం నిరాకరించాడట. 


కొన్ని రోజుల క్రితం అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ పాన్ మసాలా యాడ్‌లో నటించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అటువంటి విమర్శలను ఎదుర్కొవద్దని కార్తిక్ భావించాడు. యూత్‌కు ఐకాన్‌గా నిలవాలనుకున్నాడు. అందువల్లే అతడు ఈ యాడ్‌కు నో చెప్పాడని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్తిక్ ఆర్యన్ నిర్ణయాన్ని సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్, నిర్మాత పహ్లాజ్ నిహ్లాని (Pahlaj Nihalani) మెచ్చుకున్నాడు. ‘‘బాలీవుడ్ నటులు రోల్ మోడల్‌గా ఉండాలి. గుట్కా, పాన్ మసాలాలను ప్రోత్సహించకూడదు. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి’’ అని పహ్లాజ్ పేర్కొన్నాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. కార్తిక్ ఆర్యన్ ప్రస్తుతం ‘అల వైకుంఠపురం’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. ‘షెహజాదా’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుంది.         

Updated Date - 2022-08-29T21:23:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!