వాటివల్ల కొన్ని మంచి అవకాశాలు మిస్ అవుతాం : Kartik Aaryan

ABN , First Publish Date - 2022-05-08T17:07:59+05:30 IST

బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్..

వాటివల్ల కొన్ని మంచి అవకాశాలు మిస్ అవుతాం : Kartik Aaryan

బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ నటించిన తాజా చిత్రం ‘భుల్ భూలయ్యా 2’. కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్‌గా నటించింది. 2007లో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘భుల్ భూలయ్యా’కి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. త్వరలో విడుదలకానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. అందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ ఇటీవల తాను ఎదుర్కొన్న వివాదాలపై స్పందించాడు.


ప్రముఖ దర్శక నిర్మాత కరణ జోహార్ (Karan Johar) ‘దోస్తానా 2’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో లీడ్ రోల్‌లో కార్తీక్ నటించాల్సింది. అయితే పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేశాడు. ఇది బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. ‘ఈ పరిశ్రమలో చాలా సార్లు తప్పుగా కమ్యూనికేషన్ జరుగుతుంది. ఈ పరిశ్రమలోనే కాదు, ప్రతి పరిశ్రమలో ఇలాగే ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు మీకు మంచి జరగొచ్చు. మరికొన్నిసార్లు చెడు జరగొచ్చు. దానివల్ల కొన్ని మంచి అవకాశాలు సైతం చేజారవచ్చు. అయితే.. నా విషయంలో మాత్రం మంచే జరుగుతుందని అనుకుంటున్నాను. బహుశా OTT వల్ల కావచ్చు. నేను ప్రస్తుతం కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్టాను. అంతకుమించి మరేదాని గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు’ అని చెప్పుకొచ్చాడు.


కార్తీక్ ఎటువంటి సపోర్టు లేకుండా వచ్చి బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీని గురించి మాట్లాడుతూ.. ‘నేను ఏ ప్రొడక్షన్ హౌస్‌తో పని చేసిన బయటి వ్యక్తిలా ట్రీట్ చెయ్యరు. ఎందుకంటే.. అందరూ నా పనితో సంతోషంగా ఉన్నారు. ప్రొడక్షన్ ఆఫీస్‌లోకి ప్రవేశించిన వెంటనే నాకు ఆ వైబ్స్ వస్తాయి. నాకు అలా అనిపించిన తర్వాతే వారితో పని చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటాను’ అని తెలిపాడు.

Updated Date - 2022-05-08T17:07:59+05:30 IST

Read more