అంతా అబద్ధం.. అవన్నీ పుకార్లే.. నాకు ప్రమోషన్ వచ్చింది కానీ.. అంటూ క్లారిటీ ఇచ్చిన Kartik Aaryan

ABN , First Publish Date - 2022-06-01T15:05:32+05:30 IST

బాలీవుడ్‌లోని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ నటుల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా బీ టౌన్‌లో..

అంతా అబద్ధం.. అవన్నీ పుకార్లే.. నాకు ప్రమోషన్ వచ్చింది కానీ.. అంటూ క్లారిటీ ఇచ్చిన Kartik Aaryan

బాలీవుడ్‌లోని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ నటుల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు. ఎటువంటి సపోర్టు లేకుండా బీ టౌన్‌లో తమకంటూ గుర్తింపు పొందిన నటుల్లో కార్తీక్ కూడా ఉంటాడు. ఈ నటుడు తాజాగా నటించిన చిత్రం ‘భుల్ భులయ్యా 2’. 2007లో అక్షయ్ కుమార్ హీరోగా చేసిన ‘భుల్ భులయ్యా’కి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లని కొల్లగొట్టింది. విడుదలై పది రోజులైనప్పటికీ ఈ సినిమా హవా ఇంకా కొనసాగుతూనే ఉంది.


ఈ తరుణంలోనే ఈ సినిమా హిట్ తర్వాత కార్తీక్ తన పారితోషికాన్ని రూ.15 కోట్ల నుంచి దాదాపు రూ.30 కోట్లకు పెంచేశాడని వార్తలు వినిపించాయి. ఈ న్యూస్‌పై కార్తీక్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈ రూమర్స్‌కి సంబంధించిన వార్తని షేర్ చేసిన కార్తీక్.. ‘జీవితంలో ప్రమోషన్ వచ్చింది. కానీ ఇంక్రిమెంట్ రాలేదు. అంతా అబద్ధం’ అంటూ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు. దీంతో కార్తీక్ ట్వీట్‌కి ఫిదా అయిన పలువురు ఫ్యాన్స్ ‘సూపర్’, ‘కావాలనే కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. కార్తీక్ ప్రస్తుతం సూపర్ హిట్ టాలీవుడ్ మూవీ ‘అల వైకుంఠపురములో’ రిమేక్ ‘షెహజాదా’, కెప్టెన్ ఇండియా, ఫ్రెడ్డీ, సాజిద్ నడియాడ్ వాలా నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు.Updated Date - 2022-06-01T15:05:32+05:30 IST

Read more