అప్పటి నుంచే ప్రేమలో మునిగితేలుతున్న Sara Ali Khan, Kartik Aaryan?.. Karan Johar తాజాగా ఏం చెప్పాడంటే..

ABN , First Publish Date - 2022-07-08T16:55:18+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటీనటుల్లో కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్ ఖచ్చితంగా ఉంటారు...

అప్పటి నుంచే ప్రేమలో మునిగితేలుతున్న Sara Ali Khan, Kartik Aaryan?.. Karan Johar తాజాగా ఏం చెప్పాడంటే..

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటీనటుల్లో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan), సారా అలీఖాన్ (Sara Ali Khan) ఖచ్చితంగా ఉంటారు. ఈ నటులిద్దరూ అందంతోపాటు అభినయంతోనూ అభిమానులను ఆకట్టుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. వీరిద్దరూ కలిసి ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ‘లవ్ ఆజ్ కల్’లో జంటగా నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. సినిమా విడుదలకి ముందే విడిపోయారని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే.. ఈ న్యూస్‌పై ఆ జంట ఎప్పుడూ స్పందిచలేదు. కానీ.. ఈ జంట గురించి చిత్రనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) తాజాగా ఓ షోలో మాట్లాడాడు.


కరణ్ జోహార్ సినిమాలతోపాటు ‘కాపీ విత్ కరణ్’ అనే షోకి హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లని విజయవంతంగా పూర్తి చేసుకోగా.. తాజాగా ఏడో సీజన్ టెలికాస్ట్ అవుతోంది. ఈ షోకి వచ్చే ఎంతోమంది సెలబ్రిటీలను కరణ్ రకరకాల ప్రశ్నలు వేస్తూ వారినుంచి సమాధానాలు రాబడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఆ సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి విషయం గురించి ఆసక్తికర విషయాలను బయటపడేలా చేస్తుంటాడు. అలా వారు చెప్పిన పలు విషయాల గురించి కరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్‌లోని కొన్ని జంటల గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. అందులో ముఖ్యంగా.. సారా, కార్తీక్‌పై చేసిన చేసిన కామెంట్స్ అందరినీ బాగా ఆకర్షించాయి.


కరణ్ మాట్లాడుతూ.. ‘నేను నా షోలో ఉపయోగించే సోఫాని మంచం అని పిలుస్తాను. ఎందుకంటే.. అక్కడ వారు చెప్పే విషయాలు తర్వాత నిజమయ్యాయి. ఓ ఎపిసోడ్‌లో కత్రినా కైఫ్ (Katrina Kaif) మాట్లాడుతూ.. తను, విక్కీ కౌశల్ జంటగా బావుంటామని చెప్పింది. తర్వాత కొద్ది రోజులకే వారిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. రణ్‌బీర్ కపూర్ గురించి ఆలియా భట్ మాట్లాడింది. వారిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. అలాగే.. సారా అలీఖాన్ ఓ ఎపిసోడ్‌లో కార్తీక్ ఆర్యన్ పేరు చెప్పింది. అతనంటే ఆమెకి క్రష్ ఉందని తెలిపింది. ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఈ సోఫా ఇలా ఎన్నో బంధాలను చిగురించేలా చేయడం అద్భుతంగా అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.


కాఫీ విత్ కరణ్ షోలో 2018లో సారా పాల్గొంది. అందులోనే కార్తీక్ ఆర్యన్ ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తాడని తెలిపింది. అనంతరం వారిద్దరూ కలిసి ‘లవ్ ఆజ్ కల్’ సినిమాలో నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఇటీవలే సారా, కార్తీక్ కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అక్కడ వారిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ రూమర్స్‌కి మరింత ఊతం దొరికినట్లైంది.

Updated Date - 2022-07-08T16:55:18+05:30 IST

Read more