సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SAMANTHA ‘మగబుద్ధి’ పాట... క్యూట్ అంటోన్న బాలీవుడ్ హాట్ సింగర్!

ABN, First Publish Date - 2022-01-23T00:27:07+05:30

‘పుష్ప’ సినిమాలో సమంత ‘ఊ అంటావా’ అంటూ స్టెప్పులేస్తే పెద్ద రచ్చే జరిగింది. కొందరు పాట బావుందని పొగిడితే మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఇక ఇంకొందరైతే పేరడి పాట కూడా రాసేశారు. ఇదంతా తెలుగు రాష్ట్రాల్లోని గోల. మరి హిందీ వర్షన్ సంగతేంటి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పుష్ప’ సినిమాలో సమంత ‘ఊ అంటావా’ అంటూ స్టెప్పులేస్తే పెద్ద రచ్చే జరిగింది. కొందరు పాట బావుందని పొగిడితే మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఇక ఇంకొందరైతే పేరడి పాట కూడా రాసేశారు. ఇదంతా తెలుగు రాష్ట్రాల్లోని గోల. మరి హిందీ వర్షన్ సంగతేంటి? 


‘పుష్ప’ హిందీ వర్షన్‌కి బాలీవుడ్‌లో భారీ వసూళ్లే వచ్చాయి. అలాగే, సమంత ఐటెం నెంబర్ కూడా బాగానే పాప్యులర్ అయింది. మరి హిందీ సాంగ్ పాడింది ఎవరు? బీ-టౌన్ క్రేజీ సింగర్ కనికా కపూర్. జోష్‌పుల్ పాటలకు కేరాఫ్ అయిన ఆమె హస్కీగా రక్తి కట్టించింది ‘ఊ బోలేగా’ పాటని. అయితే, ఆమెకు పాట పాడిన తరువాత తెలిసిన వారి నుంచీ కాల్స్, మెసేజెస్ వచ్చాయట!


‘‘నువ్వు ఏమీ అనుకోనంటే... నాకైతే పాట పెద్దగా నచ్చలేదు...’’ అంటూ కనికా కపూర్‌కి చాలా మంది కంప్లైంట్ చేశారట. ఆమె కూడా ‘ఓకే’ అనుకుని లైట్ తీసుకుందట. ‘‘సాధారణంగా అమ్మాయిల మీదే ఎప్పుడూ ఇలాంటి పాటలు కడుతుంటారు. ఇప్పుడు మగవాళ్ల మీద ఈ క్యూట్ నెంబర్ వచ్చింది. పాట రూపొందించిన టీమ్‌కి... Kudos!’’ అందామె. 

Updated Date - 2022-01-23T00:27:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!