సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హిందీ ఎందుకు... ఆ భాషని జాతీయ భాష చేసుకుందాం అంటున్న Kangana Ranaut...

ABN, First Publish Date - 2022-04-30T04:42:46+05:30

జాతీయ భాష చర్చలోకి బాలీవుడ్ కాంట్రవర్సి క్వీన్ కంగనా కూడా కాలుమోపింది. సుధీప్, అజయ్ దేవగణ్ మధ్య హిందీ విషయంలో రచ్చ జరగటంతో మీడియా కంగనాని కూడా కదిపింది. హిందీ జాతీయ భాష సంగతి ఏంటని అడిగింది. దానికి కాస్త భిన్నంగా స్పందించిన రనౌత్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ భాష చర్చలోకి బాలీవుడ్ కాంట్రవర్సి క్వీన్ కంగనా కూడా కాలుమోపింది. సుధీప్, అజయ్ దేవగణ్ మధ్య హిందీ విషయంలో రచ్చ జరగటంతో మీడియా కంగనాని కూడా కదిపింది. హిందీ జాతీయ భాష సంగతి ఏంటని అడిగింది. దానికి కాస్త భిన్నంగా స్పందించిన రనౌత్, సంస్కృతం మన జాతీయ భాష కావాలని అభిప్రాయపడింది. అంతే కాదు, కన్నడ, తమిళం, గుజరాతీ, హిందీ కంటే కూడా సంస్కృతం పురాతనమైందని ఆమె వ్యాఖ్యానించింది. పైగా భారతీయ భాషలన్నీ సంస్కృతం నుంచే వచ్చాయని కంగనా విశ్లేషించింది. కాబట్టి దేవభాషైన సంస్కృతం కంటే మరేది జాతీయ భాషగా ఉండటానికి తగింది కాదని ఆమె చెప్పుకొచ్చింది. 


హిందీ జాతీయ భాష కాదని కన్నడ నటుడు సుధీప్ వ్యాఖ్యానించటం... అందుకు ప్రతిగా హిందీ ఎప్పటికీ జాతీయ భాషేనని అజయ్ దేవగణ్ అనటం పెద్ద చర్చకి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే కంగనా సంస్కృతాన్ని ముందుకు తీసుకు వచ్చింది. అయితే, ఆమె కన్నడ, తమిళం వంటి దక్షిణాది భాషలకంటే సంస్కృతం పురాతనం అనటం... ఇక్కడి వారు ఎలా స్వీకరిస్తారో చూడాలి. ముఖ్యంగా తమిళులు తమ భాష విషయంలో చాలా భావోద్వేగంతో స్పందిస్తుంటారు. కంగనా కామెంట్స్ వారికి నచ్చే అవకాశాలు స్వల్పమే...  

Updated Date - 2022-04-30T04:42:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!