బిగ్‌బాస్‌, లాకప్ సేమ్ అంటూ కామెంట్స్.. కంగనా రనౌత్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-06T15:52:59+05:30 IST

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో కంగనా రనౌత్ ఒకరు. సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ షోని హోస్ట్ చేస్తోంది...

బిగ్‌బాస్‌, లాకప్ సేమ్ అంటూ కామెంట్స్.. కంగనా రనౌత్ రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో కంగనా రనౌత్ ఒకరు. సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ షోని హోస్ట్ చేస్తోంది. అయితే ఈ షో ఎనౌన్స్‌మెంట్ వచ్చిన వెంటనే సల్మాన్ ‌ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్‌బాస్’తో పోల్చుతూ నెటిజన్లు కామెంట్స్ ప్రారంభించారు. తాజాగా ఈ కామెంట్స్‌పై కంగనా స్పందించింది.


కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్’లాంటి అన్నీ టీవీ షోలలో పోటీదారులు ఉంటారు. కానీ ‘లాకప్’లో ఖైదీలు ఉంటారు. వారు జైలులో ఉంటారు. అందులో నుంచి విజేతను ఎన్నుకుంటాను. అయితే కొంతమందికి ఫేవర్‌గా ఉండడం, ఉండగపోవడమనేది సాధారణ మానవుడి స్వభావాల్లో ఒకటి. కానీ అది నా నిర్ణయాన్ని ప్రభావితం చేయదు. నేను చాలా ఆబ్జెక్టివ్ వ్యక్తిని. అందుకే ఎవరి ప్రలోభావాలకు లొంగను. మిగతా రియాలిటీ షోల మాదిరి ఇందులో విజేత ఎంపిక జరగదు.


జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనే సత్తా, అప్పటికప్పుడు  నిర్ణయాలు తీసుకునే సత్తా, సరదాగా, స్వచ్ఛంగా ఉండే వ్యక్తిని విన్నర్‌‌గా ఎన్నుకొంటాను. అలాంటి వ్యక్తికే నా మద్ధతు ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-03-06T15:52:59+05:30 IST