సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RRR సినిమాపై, రాజమౌళిపై.. కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కామెంట్స్..!

ABN, First Publish Date - 2022-03-30T21:03:21+05:30

రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సృష్టించిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సృష్టించిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలై ఎన్నో సినీ రికార్డులను కొల్లగొట్టడమే కాకుండా తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి చేర్చింది. ఆ సినిమాల తర్వాత రాజమౌళి చేసిన ‘ఆర్‌ఆర్ఆర్’ ఇటీవలే విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంపై ఎంతోమంది సినీ, సినిమాయేతర ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచుకున్న కంగనా రనౌత్ సైతం ఈ సినిమాపై, రాజమౌళిపై సోషల్ మీడియా వేదికగా పోస్టు ద్వారా ప్రశంసలు కురిపించింది. కంగనా పెట్టిన ఇన్‌స్టా‌గ్రామ్ స్టోరీలో.. ‘ఎస్‌ఎస్ రాజమౌళి సార్ భారతీయ చలనచిత్ర దర్శకుడని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకూ ఆయన ఒక్క ఫ్లాప్ సినిమా కూడా తీయలేదు. ఆయన తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ అందుకున్నాయి’అంటూ రాసుకొచ్చింది.


అలాగే మరో స్టోరీలో సైతం.. ‘అయితే ఇక్కడ చెప్పుకునే గొప్ప విషయం ఆయన విజయాల గురించి కాదు. ఆయనలోని వినయం, సరళత, ఓ వ్యక్తిగా దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయనకున్న ప్రేమ చాలా గొప్పవి. మీలాంటి రోల్ మోడల్ ఉండడం మా అదృష్టం సార్.. నిజాయితీగా నేను మీ అభిమానిని’ అంటూ రాసుకొచ్చింది.

Updated Date - 2022-03-30T21:03:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!