Bollywood లో ఒక్క సెలబ్రెటీకి కూడా నా ఇంటికి వచ్చే అర్హత లేదు.. Kangana Ranaut కాంట్రవర్సియల్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-05-18T01:10:55+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీల గురించి మాట్లాడాల్సి వస్తే కంగనా రనౌత్ అస్సలు మొహమాటపడదు. కుండబద్ధలు కొట్టినట్టుగా విమర్శలు చేస్తుంది. తాజాగా ఆమె... మొత్తం బీ-టౌన్ లో తన ఇంట్లో కాలుమోపే అర్హత గల ఒక్క సెలబ్రిటీ కూడా లేరని ఘాటుగా వ్యాఖ్యానించింది.

Bollywood లో ఒక్క సెలబ్రెటీకి కూడా నా ఇంటికి వచ్చే అర్హత లేదు.. Kangana Ranaut కాంట్రవర్సియల్ కామెంట్స్

బాలీవుడ్ సెలబ్రిటీల గురించి మాట్లాడాల్సి వస్తే కంగనా రనౌత్ అస్సలు మొహమాటపడదు. కుండబద్ధలు కొట్టినట్టుగా విమర్శలు చేస్తుంది. తాజాగా ఆమె... మొత్తం బీ-టౌన్ లో తన ఇంట్లో కాలుమోపే అర్హత గల ఒక్క సెలబ్రిటీ కూడా లేరని ఘాటుగా వ్యాఖ్యానించింది. 


అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటించిన ‘ధాకడ్’ సినిమాలో కంగనా యాక్షన్ స్టార్ గా

అలరించబోతోంది. భారీ ఫైట్స్ తో మెస్మరైజ్ చేయనున్న డేరింగ్ లేడీ బాలీవుడ్ లో తనకు ఫ్రెండ్ కాగల స్థాయి ఎవరికీ లేదని చెబుతోంది. 


ఆదివారం వేళ కంగనా ఇంట్లో అతిథులుగా భోజనం చేయాల్సి వస్తే... ఆ అవకాశం బాలీవుడ్ లో ఏ ముగ్గురికి దక్కుతుందని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ‘ధాకడ్’ స్టార్  సూటిగా, సుత్తి లేకుండా సమాధానం ఇచ్చింది. తన ఇంటికి వచ్చి విందులో పాల్గొనేటంత విలువ హిందీ సినిమా రంగంలో ఎవరికీ లేదని చెప్పిన ఆమె.... బయట ఎక్కడైనా బాలీవుడ్ సెలబ్రిటీల్ని కలిస్తే ఫర్వాలేదుగానీ... వారెవ్వర్నీ ఇంటికి మాత్రం ఆహ్వానించవద్దని సూచించింది! 


మీకు అసలు బీ-టౌన్ లో ఫ్రెండ్సే లేరా అన్న క్వశ్చన్ కి కూడా... కంగనా ‘‘లేరంటే... లేరు’’ అని బదులిచ్చింది. తనతో దోస్తీ చేయాలంటే అందుకు తగిన అర్హత కావాలని చెప్పింది. అటువంటి క్వాలిఫికేషన్ హిందీ సినిమా రంగంలో ఒక్కరికి కూడా లేదని నొక్కి పలికింది! 


‘ఏజెంట్ అగ్ని’గా కనిపించబోతోంది ‘ధాకడ్’ సినిమాలో కంగనా. మనుషుల, ఆయుధాల అక్రమ రవాణా చేసే డేంజరస్ స్మగ్లర్ గా నటించాడు అర్జున్ రాంపాల్. అయితే, ‘ధాకడ్’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కంగనా తనతో కలసి పని చేసేందుకు బాలీవుడ్ లో చాలా మంది సందేహిస్తున్నారని వ్యాఖ్యానించింది. తనతో పని చేసిన వార్ని బీ-టౌన్ బిగ్ సెలబ్రిటీస్ టార్గెట్ చేస్తున్నారని ఆమె చెప్పింది. అయినా కూడా అర్జున్ రాంపాల్ తనతో సినిమా చేశాడంటూ అతడ్ని మెచ్చుకుంటోంది కంగనా రనౌత్. 


‘ధాకడ్’లో కంగనా, అర్జున్ రాంపాల్ తో పాటూ దివ్యా దత్తా, షరీబ్ హష్మి, శాశ్వత ఛటర్జీ కీలక పాత్రల్లో నటించారు. రజనీశ్ ఘాయ్ దర్శకత్వంలో రూపొందిన స్పై థ్రిల్లర్ మే 20న జనం ముందుకు రాబోతోంది... 

Updated Date - 2022-05-18T01:10:55+05:30 IST