సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bollywood Actor : వివాదాస్పద ట్వీట్...ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్ నటుడి అరెస్ట్

ABN, First Publish Date - 2022-08-30T15:13:07+05:30

వివాదాస్పద ట్వీట్ చేసిన బాలీవుడ్ నటుడు(Bollywood Actor)...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి: వివాదాస్పద ట్వీట్ చేసిన బాలీవుడ్ నటుడు(Bollywood Actor) కమాల్ రషీద్ ఖాన్‌ను(Kamal Rashid Khan) పోలీసులు మంగళవారం ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో(Mumbai airport) అరెస్టు(arrested) చేశారు. బాలీవుడ్ సినిమాల్లో కేఆర్‌కేగా పేరొందిన కమాల్ ఖాన్ ముంబయి విమానాశ్రయంలో విమానం దిగగానే ముంబయి నగరంలోని మలాద్ పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించేందుకు తీసుకువెళ్లారు. 2020వ సంవత్సరంలో కమాల్ ఖాన్ చేసిన వివాదాస్పద ట్వీట్ పై(controversial tweet) వచ్చిన ఫిర్యాదు మేర మలాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.


 2020లో కమాల్ ఖాన్ చేసిన వివాదాస్పద ట్వీట్ పై అప్పట్లో పెట్టిన కేసులో అరెస్టు చేసి మంగళవారం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు చెప్పారు. బాలీవుడ్ నటుడు కమాల్ తరచూ విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కమాల్ ఖాన్ పలు హిందీ, భోజ్ పురి(Hindi and Bhojpuri films) సినిమాల్లో నటించడంతోపాటు నిర్మించారు.కేఆర్కే బిగ్‌ బాస్(Bigg Boss) కంటెస్టెంటు కూడా కావడం విశేషం.

Updated Date - 2022-08-30T15:13:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!