సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

క్షమాపణలు చెప్పిన ‘కచ్చా బాదామ్’ సింగర్.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2022-03-11T21:48:47+05:30

‘కచ్చా బాదామ్’ సాంగ్ సోషల్ మీడియాను విపరీతంగా ఊపేసిన సంగతి తెలిసిందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కచ్చా బాదామ్’ సాంగ్ సోషల్ మీడియాను విపరీతంగా ఊపేసిన సంగతి తెలిసిందే. సామాన్యూల నుంచి సెలెబ్రిటీల వరకు ఈ పాటకు స్టెప్పులేశారు. ఈ పాటను పల్లీలు అమ్ముకునే వ్యక్తి భుబన్ బద్యకర్ రాసి, ఆలపించాడు. దీంతో అతడు ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఆ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘‘నేను ఆర్టిస్టుగా ఉండాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను సెలబ్రెటీగా మారిపోయాను. ఈ స్థితిలో పల్లీలను అమ్మితే అవమానకరంగా ఉంటుంది’’ అని భుబన్ బద్యకర్ చెప్పాడు. భుబన్ ఈ విధంగా అనడంతో పలువురి నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు తాజాగా అతడు తెలిపాడు. తప్పనిసరి అయితే పల్లీలను అమ్ముతానని వెల్లడించాడు.


భుబన్‌కు తాజాగా సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో అతడు మాట్లాడాడు. ‘‘ఆ మాటలను అని ఉండకూడదు. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ప్రజలే నన్ను సెలబ్రెటీని చేశారు. తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే మరోసారి పల్లీలు అమ్మడం మొదలుపెడతాను. ప్రపంచవ్యాప్తంగా అందరి నుంచి నాకు ప్రేమ లభించింది. ఈ ప్రేమ లభించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. సెలబ్రెటీగా మారినప్పటికీ సాధారణ జీవితాన్ని మాత్రమే నేను గడుపుతున్నాను. వ్యక్తిగా నేను ఏ మాత్రం మారలేదు’’ అని భుబన్ బద్యకర్ చెప్పాడు.

Updated Date - 2022-03-11T21:48:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!