Pic Viral: సోదరి ర్యాంప్ వాక్ షోలో.. స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్న జూనియర్ శ్రీదేవి
ABN , First Publish Date - 2022-03-27T19:11:14+05:30 IST
శ్రీదేవి తనయురాలిగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి అందంతోపాటు అభినయంతో ఆకట్టుకున్న నటి జాన్వీ కపూర్...

శ్రీదేవి తనయురాలిగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి అందంతోపాటు అభినయంతో ఆకట్టుకున్న నటి జాన్వీ కపూర్. మొదటి సినిమా ‘ధడక్’తో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ అనంతరం మంచి సినిమాలు చేస్తూ తన స్టార్ డమ్‌ని పెంచుకుంటూ వెళ్లింది. అంతేకాకుండా ఈ భామ తన డ్రెస్సింగ్తోనూ యువత హృదయాలను కొల్లగొడుతుంది. తాజాగా మరోసారి జాన్వీ అందమైన డ్రెస్‌తో అభిమానులను ఆకట్టుకుంది.
తాజాగా జాన్వీ సోదరి షానయ కపూర్, నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఓ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచింది. ఈ కార్యక్రమానికి జాన్వీ తన మరో సోదరి ఖుషి కపూర్, స్నేహితులతో కలిసి హాజరైంది. దాని కోసం ఈ బ్యూటీ వేసుకొచ్చిన డ్రెస్స్ నెట్టింట వైరల్‌గా మారింది. లోనెక్తో యువత హృదయాలను కొల్లగొట్టేలా ఉన్న ఈ భామ తన సోదరి కంటే ఎక్కువ అటెన్షన్‌ని అందుకుంది. అంతేకాకుండా ఈ డ్రెస్‌లో దిగిన పిక్స్‌ని జాన్వీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అవి వైరల్‌గా మారిపోయాయి. ఆ ఫొటోలని మీరు ఓ సారి చూసేయండి..