Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసు విచారణ వాయిదా

ABN , First Publish Date - 2022-11-24T22:22:43+05:30 IST

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న సంగతి తెలిసిందే.

Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసు విచారణ వాయిదా

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) తో సత్సంబంధాలను కొనసాగించిందనే ఆరోపణలను పోలీసులు ఆమెపై మోపారు. ఆమెకు వ్యతిరేకంగా ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఫలితంగా జాక్వెలిన్ కోర్టులో పిటిషన్ వేసింది. పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరింది. కోర్టు నుంచి నవంబర్ 15న బెయిల్‌ను తెచ్చుకుంది. ఈ కేసులో భాగంగా పటియాలా కోర్టు ఎదుట జాక్వెలిన్ నవంబర్ 24న హాజరయ్యింది. ఈ కేసు విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 


సుకేశ్ చంద్ర‌శేఖర్‌కు బాలీవుడ్ సెలబ్రిటీలను పింకీ ఇరానీ పరిచయం చేసిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. పింకీకి వ్యతిరేకంగా మొదటి సప్లిమెంటరి ఛార్జిషీట్‌ను ఫైల్ చేశారు. అనంతరం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంటూ ఈడీ తాజాగా రెండో సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అందులో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీ నోరా ఫతేహీ (Nora Fatehi) వాంగూల్మాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. జాక్వెలిన్‌కు చెందిన రూ.7.2కోట్ల విలువైన వస్తువులను కూడా ఈడీ సీజ్ చేసిన సంగతి తెలిసిందే.    


Updated Date - 2022-11-24T22:22:43+05:30 IST