సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్ హీరోయిన్ Sonakshi Sinha నిశ్చితార్థం అయిపోయిందా..?

ABN, First Publish Date - 2022-05-10T00:01:17+05:30

‘షాట్ గన్’ శత్రుఘ్న సిన్హా (shatrughan sinha) కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి సోనాక్షి సిన్హా (sonakshi sinha). ‘దబాంగ్’ (Dabangg) సినిమాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘షాట్ గన్’ శత్రుఘ్న సిన్హా (shatrughan sinha) కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి సోనాక్షి సిన్హా (sonakshi sinha). ‘దబాంగ్’ (Dabangg) సినిమాతో బాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సోనాక్షి సింగిల్ లైఫ్‌కు పుల్‌స్టాప్ పెట్టిందని తెలుస్తోంది. ఆమెకు నిశ్చితార్థం అయిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా సోనాక్షి సిన్హా సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ సంతోషపడిపోయింది. ఆ పిక్స్‌లో ఉన్న వ్యక్తిని క్రాప్ చేసింది. ఆ ఫొటోల కింద క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘నాకు ఈ రోజు బిగ్ డే. నాకున్న పెద్ద కల నెరవేరబోతోంది. ఈ విషయాన్ని  మీతో పంచుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఇది నిజమవుతుందంటే నమ్మలేకపోతున్నాను’’ అంటూ సోనాక్షి చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ ఆమె ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ శుభాకాంక్షలు తెలుతున్నారు. కానీ, కొద్దిమంది మాత్రం ఇదేదో ప్రమోషనల్‌ స్టంట్‌ అని తేలికగా కొట్టిపారేస్తున్నారు. 


సోనాక్షి సిన్హా గత కొంతకాలంగా బాలీవుడ నటుడైన జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) తో డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘నోట్‌బుక్’ (Notebook) సినిమాతో అతడు బీ టౌన్‌కీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక సోనాక్షి కెరీర్ విషయానికి వస్తే.. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ (Bhuj: The Pride Of India) చిత్రంలో చివరగా కనిపించింది. ఈ మూవీలో సంజయ్ దత్, నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషించారు. ‘ఫాలెన్’ అనే వెబ్‌సిరీస్‌లోను ఆమె కనిపించనుంది. ఈ షోలో పోలీసాఫీసర్ పాత్రను పోషించనుంది.



Updated Date - 2022-05-10T00:01:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!