Madhur Bhandarkar: కంగనతో సినిమా చేయనున్నాడా..?

ABN , First Publish Date - 2022-09-24T02:00:59+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌లోనే విభిన్న‌మైనవాడు మధుర్ బండార్కర్ (Madhur Bhandarkar). ‘ఫ్యాషన్’, ‘హీరోయిన్’, ‘క్యాలెండర్ గర్ల్స్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి ఫేమ్ సంపాదించుకున్నాడు. చివరగా

Madhur Bhandarkar: కంగనతో సినిమా చేయనున్నాడా..?

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌లోనే విభిన్న‌మైనవాడు మధుర్ బండార్కర్ (Madhur Bhandarkar). ‘ఫ్యాషన్’, ‘హీరోయిన్’, ‘క్యాలెండర్ గర్ల్స్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి ఫేమ్ సంపాదించుకున్నాడు. చివరగా ‘ఇందు సర్కార్’ (Indu Sarkar) కు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 2017లో విడుదలైంది. అనంతరం అతడి నుంచి ఎటువంటి చిత్రం రాలేదు. ఐదేళ్ల అనంతరం ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer) కు దర్శకత్వం వహించాడు. తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నేరుగా ‘డిస్నీ+హాట్‌స్టార్’ లోనే స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 23నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మధుర్ బండార్కర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆసక్తికర కబుర్లను మీడియాతో పంచుకున్నాడు. కంగనా రనౌత్ (Kangana Ranaut) తో సినిమా చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించాడు. 


కంగనతో ఎటువంటి సినిమా చేయడం లేదని పేర్కొన్నాడు. అవన్ని వట్టి పుకార్లేనని కొట్టి పారేశాడు.‘‘కంగనకు అద్భుతమైన టాలెంట్ ఉంది. ప్రస్తుతానికి నేను ఆమెతో ఎటువంటి మూవీ చేయడం లేదు. నా దృష్టి అంతా బబ్లీ బౌన్సర్ పైనే ఉంది’’ అని మధుర్ బండార్కర్ తెలిపాడు. అన్ని రకాల సినిమాలు చేయడం తనకిష్టమేనని తెలిపాడు. ‘‘2017 తర్వాత నేను 3 ప్రాజెక్టులపై పనిచేశాను. అందులో బబ్లీ బౌన్సర్ ఒకటి. ఈ మూడు స్క్రిఫ్ట్‌లను రాయడానికి మూడేళ్లు పట్టింది. బబ్లీ బౌన్సర్ మహిళ ప్రాధాన్యం ఉన్న కథ. సాధారణంగా అందరూ ఒక్క సినిమా అయిపోయిన వెంటనే మరొకదానిని పట్టాలెక్కిస్తారు. కానీ, నేను కొంచెం సమయం తీసుకుని కథలను రాస్తాను. బబ్లీ బౌన్సర్ చేద్దామనుకున్నప్పుడే ఇండియాలో కరోనా వచ్చింది. రెండేళ్లు వృథా అయ్యాయి. అయినప్పటికి, నేను ‘బబ్లీ బౌన్సర్’ తో పాటు ‘ఇండియా లాక్‌డౌన్’ కు దర్శకత్వం వహించాను. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు మాత్రమే నడిచాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘గంగూబాయి కతియావాడి’, ‘భూల్ భూలయ్యా-2’ మాత్రమే వసూళ్లను రాబట్టాయి. సూపర్ హిట్‌గా నిలిచాయి’’ అని మధుర్ బండార్కర్ పేర్కొన్నాడు.

Updated Date - 2022-09-24T02:00:59+05:30 IST