సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్ సాంగ్స్‌తో పాపులరైన టాంజానియా యువకుడు కిలీ పాల్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. అతని పరిస్థితి ఏంటంటే..

ABN, First Publish Date - 2022-05-02T19:23:26+05:30

బాలీవుడ్ పాటలకు రీల్స్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన టాంజానియా యువకుడు కిలీ పాల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ పాటలకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ భారత దేశంలో గుర్తింపు పొందిన టాంజానియా యువకుడు కిలీ పాల్. ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే ఎంతోమందికి ఈతను పరిచయమే. తాజాగా ఈ సోషల్ మీడియా సంచలనంపై దాడి జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తన పిక్‌ని షేర్ చేశాడు.


అందులో.. ‘నన్ను కిందపడేయాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ దేవుడు ప్రతిసారి నన్ను పైకి లాగుతున్నాడు. నాకోసం ప్రార్థన చేయండి. నాపై 5గురు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. నన్ను నేను రక్షించుకునే ప్రయత్నంలో ఓ కత్తి తగిలి నా కుడిచేతికి గాయమైంది. నా వేలికి 5 కుట్లుపడ్డాయి. అయినప్పటికీ దేవుడి దయవల్ల నేను తిరిగి ఇద్దరిని కొట్టడంతో అందరూ పారిపోయారు. కానీ అప్పటికే నాకు గాయాలయ్యాయి’ అంటూ రాసుకొచ్చాడు.


ఈ స్టోరీని ప్రముఖ సినీ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అది వైరల్‌గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు కిలీ పరిస్థితిపై కామెంట్స్ చేస్తున్నారు. ‘తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’, ‘కొందరికి ఫేమసైన వ్యక్తులు అంటే నచ్చదు. అవన్నీ పట్టించుకోవద్దు’ అంటూ ఇండియాలోని అతని ఫాలోవర్స్ పలువురు కామెంట్స్ చేశారు.



Updated Date - 2022-05-02T19:23:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!