సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Katrina Kaif సాంగ్‌కి ఐరిష్ ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన భారతీయ యువతి.. Viral అవుతున్న వీడియో

ABN, First Publish Date - 2022-06-28T21:55:01+05:30

ఇటీవలికాలంలో భారతీయ చలనచిత్ర సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలికాలంలో భారతీయ చలనచిత్ర సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. కిలీ పాల్ వంటి ఇతర దేశాలకి చెందిన చాలా మంది కంటెంట్ సృష్టికర్తలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు.. తాజా భారతీయ చలనచిత్రాల్లోని పాటల, డైలాగ్స్‌కి లిప్ సింక్ చేసే వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అవి నెట్టింట వైరల్ అవుతూ ఆకట్టుకుంటూ ఉన్నాయి. తాజాగా సైతం అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.


తాజాగా బెల్జియంలో నివసిస్తున్న సాహిరా తనేజా అనే యువతి తన ఐరిష్ స్నేహితురాలితో కలిసి హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా నటించిన 'అగ్నీపథ్'లోని 'చిక్నీ చమేలీ (Chikni Chameli)' పాటకు డ్యాన్స్ చేశారు. ఆ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారిపోయింది. దానికి.. ‘మేము ఫెయిల్ అయ్యాం. కానీ చాలా సరదాగా అనిపించింది’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే.. వీడియోలో ఇలా డ్యాన్స్ చేసినందుకు కత్రినాకి క్షమాపణలు సైతం చెప్పింది. ఆ స్పెషల్ సాంగ్ నటించిన కత్రినా కైఫ్ (Katrina Kaif) స్టెపులను మ్యాచ్ చేసేందుకు వారిద్దరూ అలా ప్రయత్నించడం చాలామంది నెటిజన్ల మనసులను దోచుకుంది. దీంతో ‘సూపర్’, ‘ఎవరి గురించి పట్టించుకోవద్దు.. అలాగే చేయండి’, ‘మీ ఐరిష్ ఫ్రెండ్‌కి ఒకసారి ఇండియాని చూపించండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-06-28T21:55:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!