Shekhar Kapur: రాజమౌళిపై ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2022-08-09T02:09:26+05:30 IST

ఫిల్మ్ ఫేర్, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందుకున్న ఇండియన్ ఫిలిం మేకర్ శేఖర్ కపూర్ (Shekhar Kapur). దిగ్గజ దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli)తో అతడు ఓ రోజుని గడిపాడు. ఈ

Shekhar Kapur: రాజమౌళిపై ప్రశంసల వర్షం

ఫిల్మ్ ఫేర్, బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందుకున్న ఇండియన్ ఫిలిం మేకర్ శేఖర్ కపూర్ (Shekhar Kapur). దిగ్గజ దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli)తో అతడు ఓ రోజుని గడిపాడు. ఈ సందర్భంగా రాజమౌళిపై ప్రశంసల వర్షంపై కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘‘..‘గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ యస్‌యస్. రాజమౌళితో ఓ రోజుని గడపడం అద్భుతంగా ఉంది. ఈ సందర్భంగా ఫిల్మ్ మేకింగ్, కథలు, టెక్నాలజీ, ఫిలాసఫీ గురించి చర్చించుకున్నాం. అతడి నుంచి ఎంతగానో నేర్చుకున్నాను. మీ కుటుంబం ఇచ్చిన అతిథ్యానికి ధన్యుడిని. రాబోయే రోజుల్లో మరెన్నో సార్లు కలుసుకోవాలని ఆశిస్తున్నాను’’ అని శేఖర్ కపూర్ తెలిపాడు. శేఖర్ కపూర్ ట్వీట్‌కు రాజమౌళి రిప్లై ఇచ్చాడు. ‘‘మీ నుంచి కొంచెం ధైర్యం వస్తుందని ఆశిస్తున్నాను. మీ సినిమా ‘పానీ’ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. గేట్లను ఎత్తడానికి సమయం ఆసన్నమైంది’’ అని రాజమౌళి పేర్కొన్నాడు. 


కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్‌లోని యస్‌యస్. రాజమౌళి నివాసాన్ని అనుపమ్ ఖేర్ సందర్శించాడు. ఈ విషయాన్ని అనుపమ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అతడు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి కామెంట్ చేశాడు. ‘‘ప్రియమైన రమా గారు, యస్‌యస్. రాజమౌళి గారు. మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ సొంత ఇంటిలో మీకు శాలువాతో స్వాగతం పలుకడం నాకు సంతోషంగా ఉంది. మీ వినయ, విధేయతలు నాకెంతో నచ్చాయి. మీ ఇద్దరి నుంచి ఎంతగానో నేర్చుకోవాలి’’ అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రం మార్చి 25న విడుదలైంది. వరల్డ్ వైడ్‌గా రూ. 1000కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. 





Updated Date - 2022-08-09T02:09:26+05:30 IST