సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger Movie కి IMDb షాకింగ్ రేటింగ్.. అట్టర్ ఫ్లాప్ అయిన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ వంటి బాలీవుడ్ సినిమాలకంటే..

ABN, First Publish Date - 2022-08-27T21:15:41+05:30

తెలంగాణ యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). అతడు తాజాగా నటించిన సినిమా ‘లైగర్’ (Liger). పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. పూరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). అతడు తాజాగా నటించిన సినిమా ‘లైగర్’ (Liger).  పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. తొలి సారిగా ‘రౌడీ’ హీరో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. ఆగస్టు 25న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. ‘లైగర్’ కు ప్రేక్షకులు ‌ఐఎమ్‌డీబీలో షాకింగ్ రేటింగ్ ఇచ్చారు. ఈ ఏడాది అట్లర్ ప్లాప్ అయిన ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha), ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) వంటి సినిమాల కంటే తక్కువగా రేటింగ్ ఇచ్చి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.     


‘లైగర్’ కు ప్రేక్షకులు ఐఏమ్‌డీబీలో 1.9 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ఇదే తక్కువ రేటింగ్ కావడం గమనార్హం. ఐఏమ్‌డీబీలో ‘లాల్ సింగ్ చడ్డా‌’కు 5, ‘రక్షా బంధన్’ కు 4.6, ‘షంషేరా’ (Shamshera)కు 4.9, ‘దోబారా’ (Dobaaraa)కు 2.9 రేటింగ్ ఉంది. ఈ రేటింగ్‌‌లను చూసిన కొంతమంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘‘ఐఏమ్‌డీబీ‌లో చెత్త రేటింగ్ 2. కానీ, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎవరికీ నచ్చలేదు. అందుకే 1.9మాత్రమే రేటింగ్ వచ్చింది’’ ఓ నెటిజన్ తెలిపాడు. ‘’సాలా ప్లాఫ్ బ్రీడ్’’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ‘లైగర్’ పాన్ ఇండియాగా రూపొందింది. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. మైక్ టైసన్, రమ్య కృష్ణ, విషు రెడ్డి, రోనిత్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా‌కు విజయ్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. దాదాపుగా రూ. 35కోట్లను పారితోషికంగా అందుకున్నాడని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అనన్య పాండే రూ.3కోట్లు, రోనిత్ రాయ్ రూ. 1.5కోట్లు, రమ్య కృష్ణ రూ.కోటిని రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారని వదంతులు హల్‌‌చల్ చేస్తున్నాయి.



Updated Date - 2022-08-27T21:15:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!