సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఇలియానా.. కారణం అది కాదంటూ..

ABN, First Publish Date - 2022-04-14T15:45:12+05:30

‘దేవదాస్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఇలియానా డీక్రూజ్. అనంతరం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘దేవదాస్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఇలియానా డీక్రూజ్. అనంతరం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ అక్కడ సైతం మంచి గుర్తింపు పొందింది. తన సన్నని నడుముతో బీ టౌన్ కుర్రకారు మనసుని సైతం దోచేసింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమైన ఈ గోవా బ్యూటీ బాగా లావైంది. దీంతో ఎంతోమంది నెటిజన్లు ఇల్లీ బేబీని బాడీ షేమింగ్ చేశారు. దీనిపై ఈ తార ఎన్నోసార్లు తన బాధని సైతం వ్యక్తం చేసింది. తాజాగా ఓ సందర్భంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పుకొచ్చింది.


తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ.. ‘గతంలో నేనో ఆర్టికల్‌ని చదివాను. అందులో మంచి కంటెంట్ ఏం లేదు. ఎవరు రాశారో నాకు గుర్తు లేదు. కానీ అవసరమైన అంశాలను పట్టించుకోకుండా, అనవసరమైన విషయాలను చర్చించారు. అది నాకు నచ్చలేదు. అందులో ఉన్నట్లు.. నాకు 12 సంవత్సరాల వయస్సు నుంచే కొన్ని శరీర సమస్యలు ఉన్నాయి. అందుకే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. కొన్నేళ్ల కిత్రం ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అందులో ఎటువంటి సందేహం లేదు. అప్పట్లో జీవితంలో జరిగిన కొన్ని విషయాల మూలంగా చాలా డిప్రెషన్‌లోకి వెళ్లడం వల్ల అలాంటి ఆలోచనలు వచ్చాయి. అంతేకానీ.. దానికి కారణం నా శరీరాకృతి కాదు. వీటన్నింటిని కలుపుతూ ఆ ఆర్టికల్ రాసుకొచ్చారు. అది నాకు చాలా చిరాకు కలిగించింది’ అంటూ చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-04-14T15:45:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!