Ibrahim Ali Khan బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడన్న Alia Bhatt.. స్టార్ కిడ్‌ని ఆడేసుకున్న Ranveer Singh
ABN , First Publish Date - 2022-07-08T18:25:03+05:30 IST
బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్స్‌లో ఆలియా భట్ (Alia Bhatt) ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవలే..

బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్స్‌లో ఆలియా భట్ (Alia Bhatt) ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవలే రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లై మూడు నెలలు పూర్తి కాకాముందే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలోనే కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 7 మొదటి ఎపిసోడ్‌లో ఆలియా, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)తో కలిసి పాల్గొంది. ఎంతో సరదాగా సాగిన ఈ షోలో ఆ నటులని కరణ్ పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. ముఖ్యంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అయితే హిలేరియస్‌గా సాగింది.
అందులో కరణ్.. ‘ఇటీవల నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది?’ అని ఆలియాని అడిగాడు. దానికి.. ‘ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చాలా స్వీట్‌గా ఉంటారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు.. ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan). అతను నాకు చాలా అద్భుతమైన సందేశాన్ని పంపాడు. అందులో.. మీకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయడానికి సమయం కుదరలేదు. అందుకే ఇంత ఆలస్యంగా చేస్తున్నా. గంగుభాయి కతియావాడి మిమ్మల్ని చూసి మెస్మరైజ్ అయ్యాను. నాకు ఎన్నో విషయాల్లో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచే మహిళ.. రాణిగా, గంగూగా రెండు పాత్రలను ఎంతో అద్భుతంగా పోషించిందా అని ఆశ్చర్యపోయాను. పాత్రని బట్టి నీరు రూపం మార్చుకున్నట్లు.. పాత్రకి తగ్గట్లు మిమ్మల్ని మీరు మలుచుకోవడం అద్భుతం. చాలా బాగుంది. ఈ దేశంలోని ఉత్తమ నటి మీరే’ అని మేస్సేజ్ చేశాడని ఆలియా చెప్పుకొచ్చింది.
ఆలియా చదివిన మెస్సేజ్ విన్న రణ్‌వీర్ సింగ్ వెంటనే ఇబ్రహీం అలీఖాన్‌పై సెటైర్ వేస్తూ.. ‘నువ్వు అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ కన్నా చాలా బిజీ. అందుకే మెస్సేజ్ చేసేందుకు సమయం కూడా లేదు నీకు. ధన్యవాదాలు ఇగ్గి సార్’ అంటూ ఆ స్టార్ కిడ్‌పై సరదా వ్యాఖ్యలు చేశాడు. అయితే.. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ప్రస్తుతం ఆలియా, రణ్‌వీర్ జంటగా నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్నాడు. ఆయన సోదరి సారా అలీఖాన్ సైతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరు. కాగా.. ఇబ్రహీం సైతం త్వరలోనే బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆలియా ప్రస్తుతం ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తుండగా.. భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అలాగే.. రణ్‌వీర్ సింగ్ నటించిన ‘జయేశ్ భాయ్ జోర్ధార్’ ఇటీవలే విడుదలవగా.. ఆయన ప్రస్తుతం ‘సర్కస్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
Read more