సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hrithik Roshan ఇంట విషాదం

ABN, First Publish Date - 2022-06-17T23:42:57+05:30

తొలి సినిమాతోనే స్టార్‌డమ్ సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). అభిమానులందరు ముద్దుగా బాలీవుడ్ గ్రీకు వీరుడిగా పిలుస్తుంటారు. అతడు ఈ మధ్య వ్యక్తిగత జీవితంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలి సినిమాతోనే స్టార్‌డమ్ సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). అభిమానులందరు ముద్దుగా బాలీవుడ్ గ్రీకు వీరుడిగా పిలుస్తుంటారు. అతడు ఈ మధ్య వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. తన భార్య సుసానే ఖాన్‌కు కొన్నేళ్ల క్రితమే విడాకులిచ్చారు. ఆ బాధను దిగమింగక ముందే హృతిక్ అమ్మమ్మ పద్మ రాణి ఓంప్రకాష్ (Padma Rani Omprakash) మరణించారు. ముంబైలో జూన్ 16న ఆమె మృతి చెందారు.  


హృతిక్ అమ్మమ్మ పద్మ రాణి ఓంప్రకాష్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెడ్‌కే అంకితమైపోయారు. 91ఏళ్ల వయసులో ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఫిల్మ్ మేకర్ జే ఓం ప్రకాష్ (J Om Prakash) భార్యే పద్మ రాణి. ఈ దంపతులకే పింకీ రోషన్ జన్మించారు. హృతిక్ తల్లే ఈ పింకీ రోషన్. జే. ఓం ప్రకాష్ 93ఏళ్ల వయసులో ఆగస్టు 7, 2019న మరణించారు. ఆయన ‘ఆప్ కీ కసమ్’ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో రాజేష్ ఖన్నా హీరోగా నటించారు. ఈ మూవీ 1974లో విడుదలైంది. హీరో జితేంద్రతో కలసి ఓం అనేక చిత్రాల్లో పనిచేశారు. ‘అప్నా బనా లో’, ‘అప్నాపన్’, ‘ఆషా’, ‘అర్పన్’, ‘ఆద్మీ ఖిలోనా హై’ వంటి చిత్రాల్లో నటించారు. 



Updated Date - 2022-06-17T23:42:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!