ఫ్రాన్స్‌లో షికారు చేస్తున్న Hrithik Roshan, సబా ఆజాద్

ABN , First Publish Date - 2022-07-10T01:14:13+05:30 IST

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan), అప్ కమింగ్ బ్యూటీ సబా ఆజాద్ (Saba Azad)తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుసానే ఖాన్‌కు విడాకులిచ్చాక హృతిక్ ఈ అందాల భామతో

ఫ్రాన్స్‌లో షికారు చేస్తున్న Hrithik Roshan, సబా ఆజాద్

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan), అప్ కమింగ్ బ్యూటీ సబా ఆజాద్ (Saba Azad)తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుసానే ఖాన్‌కు విడాకులిచ్చాక హృతిక్ ఈ అందాల భామతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. కరణ్ జోహార్ పుట్టిన రోజు వేడుకలకు కూడా హృతిక్, సబా జంటగానే హాజరయ్యారు. ఈ జంట తమ బంధంపై ఎక్కడ పెదవి విప్పనప్పటికి ఒకరి సోషల్ మీడియా పోస్ట్‌లకు మరొకరు స్పందిస్తున్నారు. తాజాగా హృతిక్, సబా విదేశాల్లో షికారు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోను సబానే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 


హృతిక్ రోషన్, సబా ఆజాద్ ఫ్రాన్స్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. తమ రొమాంటిక్ వెకేషన్‌ను సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా సబా ఆజాద్ షేర్ చేసింది. రోడ్ ట్రిప్‌నకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో ఆమె ఎవరి ముఖాలను చూపించలేదు. ఫ్రెంచ్‌లో కామెంట్ కూడా చేసింది. హృతిక్ రోషన్, సుసానే ఖాన్‌తో ఏడేళ్ల క్రితమే భార్యభర్తలుగా విడిపోయాడు. ఈ జంట తమ 13ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికింది. దంపతులుగా విడిపోయిన అనంతరం ఎవరి దారిని వారు చూసుకున్నారు. అనంతరం హృతిక్ బీ టౌన్ బ్యూటీ సబా ఆజాద్‌తో డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. సుసానే ఖాన్, అర్స్‌లన్ గోని అనే వ్యక్తితో ప్రేమలో మునిగితేలుతోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘విక్రమ్ వేద’ (Vikram Vedha)లో నటిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కీలక పాత్ర పోషిస్తున్నాడు. పుష్కర్-గాయత్రి (Pushkar Gayathri) దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ హిట్ చిత్రం ‘విక్రమ్ వేద’ కు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. అనంతరం ‘ఫైటర్’ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడు. Updated Date - 2022-07-10T01:14:13+05:30 IST

Read more