Housefull: ఐదుగురు హీరోలతో ఐదో సినిమా
ABN , First Publish Date - 2022-10-09T01:48:17+05:30 IST
బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ ప్రాంచైజీ ‘హౌస్‌పుల్’ (Housefull). సాజిద్ నడియడ్‌వాలా (Sajid Nadiadwala) నిర్మించాడు. ఈ ప్రాంచైజీలో నాలుగు సినిమాలు వచ్చి సంచలన విజయం సాధించాయి.

బాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ ప్రాంచైజీ ‘హౌస్‌పుల్’ (Housefull). సాజిద్ నడియడ్‌వాలా (Sajid Nadiadwala) నిర్మించాడు. ఈ ప్రాంచైజీలో నాలుగు సినిమాలు వచ్చి సంచలన విజయం సాధించాయి. తాజాగా ఐదో చిత్రం రాబోతున్నట్టు తెలుస్తోంది. ‘హౌస్‌పుల్-5’ (Housefull-5) టైటిల్‌తో రూపొందుతుంది. ఈ ప్రాజెక్టులో ఐదుగురు హీరోలు నటించనున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.
‘హౌస్ పుల్-5’ లో అక్షయ్ కుమార్ (Akshay Kumar), జాన్ అబ్రహం (John Abraham), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), బాబీ డియోల్ ( Bobby Deol), రితేశ్ దేశ్‌ముఖ్ (Ritesh Deshmukh) నటించనున్నారని తెలుస్తోంది. ‘‘హౌస్‌పుల్-4 సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. అప్పటి నుంచి సాజిద్ నడియడ్‌వాలా హౌస్‌పుల్ ప్రాంచైజీని యూనివర్స్‌గా నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అన్ని పాత్రలకు ప్రాధాన్యం ఉండాలని మంచి పాయింట్ కోసం వెతుకున్నారు. చివరికి పాయింట్ దొరికింది. స్క్రిఫ్ట్ వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది చివరలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. ఈ లోపు లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని కథకు మెరుగులు దిద్దుతారు. ఈ మూవీలో చాలా పాత్రలు ఉండటంతో కామెడీకి అద్భుతమై అవకాశం ఉంది’’ అని చిత్ర బృందంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి తెలిపారు. ‘హౌస్‌పుల్-5’ లో నటిస్తున్నట్టు ఈ హీరోలు ఎక్కడ చెప్పలేదు. మేకర్స్ కూడా అందుకు సంబంధించిన ప్రకటనను వెలువరించలేదు. ‘హౌస్‌పుల్’ ప్రాంచైజీ 2010లో ప్రారంభమైంది. ఈ ప్రాంచైజీలో తర్వాతి సినిమాలు 2012, 2016, 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్ ‘హౌస్‌పుల్’ ప్రాంచైజీలోని అన్ని సినిమాల్లో నటించారు. అభిషేక్ బచ్చన్, బాబీ డియోల్ మూడు, నాలుగో భాగంలో కనిపించారు.