సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆ హీరోయిన్‌తో కలసి కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన Vijay Deverakonda

ABN, First Publish Date - 2022-05-30T01:42:07+05:30

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) ‘కాఫీ విత్ కరణ్’(Koffee With Karan) షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో 7వసీజన్ ‘డిస్నీ+హాట్ స్టార్‌’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సారి సౌత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) ‘కాఫీ విత్ కరణ్’(Koffee With Karan) షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో 7వసీజన్ ‘డిస్నీ+హాట్ స్టార్‌’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సారి సౌత్ సెలబ్రిటీలు అనేక మంది ఈ చాట్ షోలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవర కొండ(Vijay Deverakonda) ఈ షోలో సందడి చేయనున్నాడని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు కొట్టాయి. ఆ వదంతులను నిజం చేస్తూ ఈ చాట్ షోలో విజయ్ దేవరకొడ పాల్గొన్నాడు. కాఫీ మగ్‌పై సంతకం చేశాడు. అందుకు సంబంధించిన పిక్స్ బయటికీ వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


విజయ్ దేవరకొండ ‘కాఫీ విత్ కరణ్’ షోకు సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశాడు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే‌తో కలసి ఈ చాట్ షోలో సందడి చేశాడు. ఈ జోడి ‘లైగర్’ (Liger)లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ‘లైగర్’ తోనే విజయ్‌ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. చార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ కూడా షోలో పాల్గొన్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తాజాగా ‘లైగర్’లో నటించాడు. పూరీ జగన్నాథ్(Puri Jagannadh) పాన్ ఇండియాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైక్ టైసన్ అతిథి పాత్రలో మెరిశాడు. రోనిత్ రాయ్, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషించారు. ‘లైగర్’ కు కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది.

Updated Date - 2022-05-30T01:42:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!