సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

break up: సుస్మితా‌సేన్‌, లలిత్ మోదీల డేటింగ్ బంధానికి బ్రేకప్?

ABN, First Publish Date - 2022-09-06T16:12:10+05:30

ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్(Sushmita Sen), ఐపీఎల్ (INDIAN PREMIER LEAGUE)వ్యవస్థాపకుడు లలిత్ మోదీ(Lalit Modi)లు విడిపోయారా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీపీ మార్పుతో పుకార్లు షికారు

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్(Sushmita Sen), ఐపీఎల్ (INDIAN PREMIER LEAGUE)వ్యవస్థాపకుడు లలిత్ మోదీ(Lalit Modi)లు విడిపోయారా(break up) అంటే అవునంటూ నెట్టింట్లో కొన్ని పుకార్లు(rumours) షికారు చేస్తున్నాయి. సుస్మితాసేన్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్లు జులై 14వతేదీన లలిత్ మోదీ సోషల్ మీడియాలో ప్రకటించారు. సుస్మితాతో సన్నిహితంగా ఉన్న చిత్రాలను లలిత్ మోదీ సోషల్ మీడియాలో పెట్టడంతో వారి డేటింగ్ ప్రేమాయణం(relationship) బట్టబయలైంది. కాని కేవలం రెండు నెలలు కాకముందే లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్ నుంచి సుస్మిత పేరును తొలగించారు. దీంతోపాటు సుస్మితతో కలిసి ఉన్న ఫొటో డీపీని(Instagram DP) కూడా లలిత్ మార్చేశారు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని నెటిజన్లు చెబుతున్నారు. 


సుస్మితతో కలిసి ఉన్న డీపీని మార్చడంతో ఆమెతో బ్రేకప్ అయిందని నెటిజన్లు చెబుతున్నారు. సుస్మితతో కలిసి ఉన్న చిత్రం పెట్టి మై లవ్ అంటూ పోస్టు పెట్టిన లలిత్ మోదీ తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూన్ అంటూ ఐపీఎల్ చిత్రంతో పోస్టు పెట్టి నెటిజన్లను షాకింగ్ కు గురిచేశారు. సుస్మితా సేన్ ఇటీవల తన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో కలిసి ఉన్న చిత్రం వెలుగులోకి వచ్చింది. దీంతో లలిత్‌తో డేటింగ్ బంధం బ్రేకప్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.కానీ అసలు వాస్తవం ఏమిటనేది వీరిద్దరూ పెదవి విప్పితేనే వెలుగుచూస్తోంది.

Updated Date - 2022-09-06T16:12:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!