Bhavadeeyudu Bhagat Singh సినిమాలో పవన్‌తో పాటు Salman కూడానా..? హరీశ్ శంకర్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-06-11T22:57:25+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ జోరు మీదున్నాడు. విరామం అనేది లేకుండానే మూవీ షూటింగ్‌లను పూర్తి చేస్తున్నాడు.

Bhavadeeyudu Bhagat Singh సినిమాలో పవన్‌తో పాటు Salman కూడానా..? హరీశ్ శంకర్ ఏమన్నారంటే..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ జోరు మీదున్నాడు. విరామం అనేది లేకుండానే మూవీ షూటింగ్‌లను పూర్తి చేస్తున్నాడు. ఇదిలా ఉండగానే ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్ తమ చిత్రాల్లో నటించమని సల్లూ భాయ్‌ను అడుగుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో సాన్నిహిత్యం ఉండటంతో నిడివి తక్కువ అయినప్పటికీ అతిథి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే చిరంజీవి హీరోగా నటిస్తున్న‘గాడ్ ఫాదర్’ (Godfather) చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించడానికి అంగీకరించాడు. కొంత భాగం షూటింగ్‌ను కూడా పూర్తి చేశాడు. ఇదిలా ఉండగానే సల్లూ భాయ్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ (Bhavadeeyudu Bhagat Singh) సినిమాలో నటించబోతున్నాడని పుకార్లు హల్ చల్ చేయడం మొదలుపెట్టాయి. ఈ వదంతులపై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) స్పందించాడు.  


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ ప్రాజెక్టును ఒకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడని పుకార్లు షికార్లు కొట్టడం మొదలయ్యాయి. ఈ వదంతులపై హరీశ్ స్పందించాడు. ఆ వార్తలన్ని నిరాధారమని తెలిపాడు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘ఆ వార్తలు నిజం కావు. మీరు ఏదైనా రాసేముందు ఒకసారి నన్ను అడగండి. నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను’’ అని హరీశ్ శంకర్ చెప్పాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘టైగర్-3’ (Tiger 3)లో  నటిస్తున్నాడు. మనీశ్ శర్మ దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, కత్రినా కైఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈద్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha)లో, షారూఖ్ ఖాన్ కనిపించనున్న ‘పఠాన్’(Pathaan) లోను సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. 



Updated Date - 2022-06-11T22:57:25+05:30 IST