సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో ‘‘ గల్లీబాయ్’’ జంట..!

ABN , First Publish Date - 2022-01-13T01:03:06+05:30 IST

రామ్ లీలా, పద్మావత్, బాజీ రావ్ మస్తానీ వంటి భారీ తరహా సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.

సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో ‘‘ గల్లీబాయ్’’ జంట..!

రామ్ లీలా, పద్మావత్, బాజీ రావ్ మస్తానీ వంటి భారీ తరహా సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘‘ గంగూబాయి కథియావాడి’’. ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ పాత్రను పోషించింది. మరికొన్ని రోజుల్లో భన్సాలీ కొత్త సినిమాను ప్రకటించబోతున్నారు. ఆ ప్రాజెక్టు పేరు ‘‘ బైజు బావ్రా ’’. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ హీరోగా చేయబోతున్నారు. హీరోయిన్‌గా ఆలియా భట్ ఎంపికయిందని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


గతంలో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్‌లు హీరో, హీరోయిన్లుగా ‘‘ గల్లీబాయ్ ’’ సినిమాలో నటించారు. ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ‘‘ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని ’’ చిత్రంలోను నటిస్తున్నారు. అనంతరం వీరే హీరో, హీరోయిన్లుగా ‘‘ బైజు బావ్రా’’ లోను నటించబోతున్నారు. ‘‘ బైజు బావ్రా’’ 2023లో ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కాబోతుందని తెలుస్తోంది. ‘‘  సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘ గంగూబాయి కథియవాడి ’ విడుదల అవ్వగానే  ‘ బైజుబావ్రా’ పనులు మొదలవుతాయి. ఈ ఏడాది మధ్య భాగంలో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటించనున్నారు. మరో హీరోయిన్‌కు కూడా ఈ చిత్రంలో అవకాశం ఉంది ’’ అని చిత్ర బృందానికి సంబంధించిన వ్యక్తి చెప్పారు.

Updated Date - 2022-01-13T01:03:06+05:30 IST