సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నిర్మాత కొడుకుతో వరుణ్ తేజ్ హీరోయిన్ డేటింగ్.. స్పందించిన నటి..

ABN, First Publish Date - 2022-01-30T01:28:48+05:30

మహేశ్ మంజ్రేకర్ కూతురిగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది సయిూ మంజ్రేకర్. తొలి సినిమాతోనే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్ మంజ్రేకర్ కూతురిగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది సయిూ మంజ్రేకర్. తొలి సినిమాతోనే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది. ‘దబంగ్-3’ మూవీలో బాలీవుడ్ కండల వీరుడి పక్కన నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌కి కూడా పరిచయం కాబోతోంది. వరుణ్ తేజ్ సరసన ‘గని’ సినిమాలో నటిస్తోంది. సయిూ మంజ్రేకర్ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా కొడుకు సుభాన్ నడియాడ్ వాలాతో కనిపించింది. దీంతో ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఈ సందర్భంగా ఆ జంట ఫొటోలు తీయొద్దని కోరింది. మాకు ప్రైవసీ కావాలని వారు రిక్వెస్ట్ చేశారు. కాసేపటికే ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  ఫలితంగా బీ టౌన్‌లో ఒక్కసారిగా పుకార్లు గుప్పుమన్నాయి. సుభాన్‌తో ఆమె డేటింగ్ చేస్తోందని వదంతులు షికార్లు కొట్టడం మొదలుపెట్టాయి.  తాజాగా సయిూ మంజ్రేకర్ మీడియాతో మాట్లాడింది. ఆ పుకార్లన్నింటిని ఖండించింది. 




‘‘నేను, సుభాన్ ఇద్దరం చిన్ననాటి నుంచి స్నేహితులం. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. మేం డేటింగ్ చేస్తున్నట్టు వస్తోన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అటువంటి వార్తలను ప్రచారం చేయడం చాలా ఘోరం. చిన్నతనం నుంచి నాపై ఇటువంటి పుకార్లు ఎప్పుడు రాలేదు. నా స్నేహితులు, కుటుంబసభ్యులకు నేనేంటో తెలుసు. అటువంటి వార్తలను నేను పట్టించుకోను ’’ అని సయిూ మంజ్రేకర్ చెప్పింది.

Updated Date - 2022-01-30T01:28:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!