సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shah Rukh Khan: కింగ్ ఖాన్ వదిలేస్తాడేమోనని భయపడ్డా.. షారుఖ్ భార్య గౌరీ ఖాన్ భయానికి కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-08-21T15:42:28+05:30

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) టాప్ ప్లేస్‌లో ఉంటాడు. ఆయని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) టాప్ ప్లేస్‌లో ఉంటాడు. ఆయని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బీభత్సంగా ఉంటుంది. ముఖ్యంగా ఆయనకి లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. దాంతో కెరీర్ పిక్స్‌కి రాకముందే నటుడు గౌరీని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆయన స్టార్‌గా ఎదిగాడు. ఆ సమయంలో భయపడ్డట్లు గౌరీ ఓ ఇంటర్వ్యూలో ఓ సమయంలో చెప్పుకొచ్చింది.


గౌరీ ఖాన్, హృతిక్ రోషన్ మాజీ భార్య గతంలో కరణ్ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్(Koffee With Karan)’కి గెస్టులుగా వచ్చారు. ఈ సందర్భంగా కరణ్ వారిని పలు క్రేజీ ప్రశ్నలు అడుగుతూ ఎంటర్‌టైన్ చేశాడు. అందులో భాగంగా.. ‘ఒకవేళ షారుఖ్ వేరే మహిళను చూసుకుంటాడనే భయం ఉందా.. చూసుకుంటే మీరు ఏం చేస్తారు?’ అని అడిగాడు. దానికి రిప్లైగా.. ‘మొదట ఈ ప్రశ్న ఎవరైనా అడిగినా లేక ఆ ఆలోచన వచ్చిన చాలా చిరాకు వేస్తుంది. అయితే.. ఆయనకి కొత్తగా ఎవరైనా దొరికితే.. నాకు ఒకడు దొరకాలని, అది కూడా చాలా అందంగా ఉండాలని దేవుడ్ని కోరుకునేదాన్ని. ఎందుకంటే మా పెళ్లైనప్పుడూ ఆయనకి ఇంతా స్టార్‌డమ్ లేదు. వచ్చిన తర్వాత వదిలేస్తామడేమోనని భయం వెంటాడేది’ అని గౌరీ ఖాన్ (Gauri Khan) ఫర్ఫెక్ట్‌గా సమాధానం చెప్పింది. దాంతో కరణ్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి.. తర్వాత గట్టిగా నవ్వేశాడు. అయితే.. స్టార్‌డమ్ పెరిగిన తర్వాత కూడా షారుఖ్ వేరే వారిని చూసుకోకుండా ఉన్నాడు. ఈ జంటకి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2022-08-21T15:42:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!