ఆయనపై శిబానీతో పాటు నాకు క్రష్ ఉండేది : బాలీవుడ్ నటి
ABN , First Publish Date - 2022-02-27T19:05:28+05:30 IST
ప్రముఖ నటుడు, డైరెక్టర్ ఫరాన్ అక్తర్, నటి శిబానీ దండేకర్ ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో ‘ఐ కేన్ డూ దట్’ షోలో ఈ నటులిద్దరికీ పరిచయం అయ్యింది...
ప్రముఖ నటుడు, డైరెక్టర్ ఫరాన్ అక్తర్, నటి శిబానీ దండేకర్ ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో ‘ఐ కేన్ డూ దట్’ షోలో ఈ నటులిద్దరికీ పరిచయం అయ్యింది. ఆ షోకి ఫరాన్ హోస్ట్ చేయగా.. శిబానీ అందులో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అంతేకాకుండా అందులో మరో నటి గౌహర్ ఖాన్ కూడా ఓ కంటెస్టెంట్ గా చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌహర్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
గౌహర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘వారు ఎప్పుడు ప్రేమలో పడ్డారో నాకు తెలియదు. ఎందుకంటే నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. అయితే షో టైమ్‌లో మాకు ఫర్హాన్‌పై క్రష్ ఉండేది. నేను, షిబానీ మిగిలిన కంటెస్టెంట్స్ ఆయన గురించే మాట్లాడుకునేవాళ్లం. ఎక్కువగా ఆయన అందం, తెలివి గురించి చర్చించుకునేవాళ్లం’ అని చెప్పుకొచ్చింది.
ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్న కొత్త జంట గురించి ఖాన్ మాట్లాడుతూ.. ‘రెండు సంవత్సరాల తరువాత, వారు ప్రేమలో ఉన్నారని తెలిసినప్పుడు నేను చాలా సంతోషించాను. జంటగా వారు ఎంతో బావున్నారు. ఎవరైన వేరేవారితో ప్రేమలో పడాలంటే ఒకరిపై మరొకరికి ప్రత్యేక అనుభూతి కలగాలి. అది వారి మధ్య జరిగింది. అందుకే పెళ్లి చేసుకున్నారని అని అనుకుంటున్నా. వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ తెలిపింది.