సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Salman Khanకి బెదిరింపు లేఖ.. గతంలో చంపేస్తానని బెదిరించిన గ్యాంగ్‌స్టర్‌ని ప్రశ్నించిన పోలీసులు

ABN, First Publish Date - 2022-06-07T22:16:49+05:30

బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి, రచయిత సలీం ఖాన్‌కు ఇటీవల బెదిరింపు లేఖ అందిన విషయం తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి, రచయిత సలీం ఖాన్‌కు ఇటీవల బెదిరింపు లేఖ అందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నమోదు చేసుకుని జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఢిల్లీ పోలీసులు విచారించారు.


కొన్ని సంవత్సరాల క్రితం.. కృష్ణజింకలను వేటాడిన కేసులో ఈ గ్యాంగ్‌స్టర్ ప్రమేయం ఉందని, కొన్ని లేఖలు బయటికి రావడంతో సల్మాన్ ఖాన్‌ని చంపేస్తానని బిష్ణోయ్ ప్రమాణం చేశాడు. దీంతో స్పెషల్ సెల్ అతన్ని తాజాగా ప్రశ్నించింది. అయితే.. ఆ మరణ బెదిరింపుల్లో తన ప్రమేయం లేదని బిష్ణోయ్ విచారణలో చెప్పినట్లు సమాచారం. మరే విషయాల గురించి ఈ గ్యాంగ్‌స్టర్ చెప్పలేదని తెలుస్తోంది.


సలీం ఖాన్ ప్రతిరోజూ మార్నింగ్ బాంద్రా బ్యాండ్‌స్టాండ్ ప్రొమెనేడ్‌లో జాగింగ్‌కి వెళుతుంటారు. ఆ సమయంలో విశ్రాంతి కోసం ఓ బెంచ్‌పై కూర్చుంటూ ఉంటారు. ఎప్పటిలాగే తాజాగా సైతం ఆయన జాగింగ్ వెళ్లారు. ఈ తరుణంలో ఆయన విశ్రాంతి తీసుకునే బెంచ్ దగ్గర సంతకం లేని లెటర్ ఒకటి దొరికింది. అందులో సలీం ఖాన్‌తోపాటు సల్మాన్ ఖాన్‌ని పంజాబీ సింగర్ మూస్‌వాలాలాగే చంపేస్తామని అందులో రాసి ఉంది. కాగా.. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడమే కాకుండా.. స్థానికులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-06-07T22:16:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!