సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Telugu actor: తెలుగు నటిపై ఫిట్‌నెస్ ట్రైనర్ అత్యాచారం

ABN, First Publish Date - 2022-09-14T12:52:27+05:30

ఓ తెలుగు నటిపై(Telugu actor) ఫిట్‌నెస్ ట్రైనర్(Fitness trainer) అత్యాచారం చేసిన ఘటన సంచలనం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి: ఓ తెలుగు నటిపై(Telugu actor) ఫిట్‌నెస్ ట్రైనర్(Fitness trainer) అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. మహారాష్ట్రలోని ముంబయి(Mumbai) నగరంలో కూఫీ పరేడ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన ఆదిత్యకపూర్ ఓ తెలుగునటిపై అత్యాచారం చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫిట్‌నెస్ ట్రైనర్ ఆదిత్యకపూర్ పలుసార్లు అత్యాచారం చేశాడని, అనంతరం వివాహం(marry) చేసుకునేందుకు నిరాకరించాడని తెలుగునటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకోవాలని అడిగితే ఆదిత్య కపూర్ తనను దూషించి కొట్టాడని తెలుగునటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన అశ్లీల చిత్రాలు నిందితుడి వద్ద ఉన్నాయని వాటిని బహిర్గతం చేస్తానని బెదిరిస్తున్నాడని తెలుగునటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 దీంతో ముంబయి పోలీసులు(ఫిట్‌నెస్ ట్రైనర్) ఫిట్‌నెస్ ట్రైనర్ ఆదిత్యకపూర్ పై  ఐపీసీ సెక్షన్ 376, 323,504,506(2), 67,67ఎ, ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అత్యాచార బాధితురాలైన తెలుగునటి 2016వ సంవత్సరం నుంచి తెలుగు చిత్రపరిశ్రమలో(Telugu industry) ఉన్నారు. ఈమె పలు తెలుగు చిత్రాల్లోనూ(Telugu films)నటించారు. ముంబయి పోలీసులు నిందితుడైన ఆదిత్యకపూర్ ను అరెస్టు(arrest) చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-09-14T12:52:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!