Amitabh ఇంట్లో పార్టీ.. మంటల్లో చిక్కుకున్న Aishwarya Rai మేనేజర్.. సరిగ్గా మూడేళ్ల క్రితం ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-23T20:50:46+05:30 IST

బాలీవుడ్‌లో కొత్త రకం పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). ఈ మధ్యనే ‘ఝుండ్’ లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రతి ఏడాది దీపావళికీ

Amitabh ఇంట్లో పార్టీ.. మంటల్లో చిక్కుకున్న Aishwarya Rai మేనేజర్.. సరిగ్గా మూడేళ్ల క్రితం ఏం జరిగిందంటే..

బాలీవుడ్‌లో కొత్త రకం పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). ఈ మధ్యనే ‘ఝుండ్’ లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రతి ఏడాది దీపావళికీ ఆయన పార్టీ ఇస్తుంటారు. ఆ విధంగానే 2019లోను ఇచ్చారు. ఈ పార్టీకి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) కూడా వచ్చింది. ఆ సంబరాల్లో ఐశ్వర్య మేనేజర్ మంటల్లో చిక్కుకున్నారు. ఆ సమయంలో ఓ స్టార్ హీరో వచ్చి మేనేజర్‌ను కాపాడారు. వివరాల్లోకి వెళ్లితే..


బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్య రాయ్‌కు అనేక ఏళ్లుగా అర్చన సదానంద్(Archana Sadanand) మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం బిగ్ బీ దీపావళి పార్టీ ఇచ్చారు. ఈ సంబరాలకు అనుష్క శర్మ, విరాట్  కోహ్లీ, రిషి కపూర్, నీతూ సింగ్, పరిణీతి చోప్రా, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్‌తో పాటు మరికొందరు హాజరయ్యారు. ఐశ్వర్య తన మేనేజర్ అర్చనతో కలసి ఈ పార్టీలో సందడి చేశారు. అమితాబ్  ఇంటి వెనుక భాగంలో తెల్లవారుజామున 3గంటలకు మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న అర్చన డ్రెస్‌కు అంటుకున్నాయి. ఈ ఘటనతో అందరు షాక్‌కు గురయ్యారు. అప్పుడు బీ టౌన్ బాద్‌షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) చాకచక్యంగా ఆమెను కాపాడాడు. అనంతరం చికిత్స కోసం ఆమెను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో షారూఖ్‌కు కూడా గాయాలయ్యాయి. స్ర్కీన్ మీద మాత్రమే హీరోలు స్టంట్స్ చేస్తుంటారు. కానీ, రియల్ లైఫ్‌లోను హీరోయిక్ ప్రదర్శనతో ఆమె ప్రాణాలను షారూఖ్ కాపాడటం విశేషం. 

Updated Date - 2022-05-23T20:50:46+05:30 IST

Read more