సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vicky Kaushal Review on Shamshera: సారీ.. ఈసారికి మాత్రం నిన్ను నమ్మం గురూ.. విక్కీ కౌశల్‌పై నెట్టింట సెటైర్లు

ABN, First Publish Date - 2022-07-25T19:38:58+05:30

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత రణ్‌బీర్ కపూర్ నటించిన చిత్రం ‘షంషేరా’. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన చిత్రం ‘షంషేరా (Shamshera)’. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీలో వాణీ కపూర్ (Vaani Kapoor), సంజయ్‌దత్ కీలకపాత్రల్లో నటించారు. మూవీ ఎనౌన్స్‌మెంట్ నుంచి భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ జూలై 22న దేశవ్యాప్తంగా విడుదలైంది. విడుదల మొదటి రోజు నుంచే ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.


యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) తాజాగా చూశాడు. ఈ తరుణంలో విక్కీ థియేటర్‌ నుంచి బయటికి వస్తూ మీడియా కంటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ‘సినిమా ఎలా ఉంది విక్కీ’ అని రిపోర్టర్స్ అడగగా.. బావుంది, సూపర్ అంటూ థమ్స్‌అప్ సింబల్ చూపించాడు. దీంతో విక్కీ మీద పలువురు నెటిజన్లు సెటైర్లు వేయడం ప్రారంభించారు.


‘ఈ సినిమా పక్కాగా బాగాలేదు.. అయినా ఎలా బావుందని చెప్పగలుగుతున్నావు విక్కీ’ అంటూ ఓ నెటిజన్.. ‘విక్కీ నిజంగా మేకర్స్ మనోభావాలను దెబ్బతీయాలని కోరుకోలేదు, అలా అని అక్కడే నిలబడి అబద్ధం చెప్పలేకపోయాడు’ అంటూ మరో నెటిజన్.. ‘ఇలాంటి చెత్త సినిమా చూసిన తర్వాత కూడా ఎలా మామూలుగా బావుందని చెప్పగలుగుతున్నావు’ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరైతే.. ‘సారీ.. ఈసారికి మాత్రం నిన్ను నమ్మం గురూ’ అంటూ సెటైర్లు సైతం వేశాడు. 


కాగా.. విక్కీ కౌశల్ ప్రస్తుతం వరుసగా పలు సినిమాలు చేస్తున్నాడు. కియారా అడ్వాణీ, భూమి పడ్నేకర్‌‌తో కలిసి ‘గోవింద నామ్ మేరా’ అనే మూవీలో నటిస్తున్నాడు. అలాగే.. సారా అలీఖాన్‌తో కలిసి పేరు పెట్టని సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. వాటితోపాటు ‘శ్యామ్ బహదూర్’, ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే చిత్రాలు చేస్తున్నాడు.



Updated Date - 2022-07-25T19:38:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!