సముద్రంలో చెత్త ఏరిన బాలీవుడ్ బ్యూటీ Parineeti Chopra.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-19T18:27:35+05:30 IST

బాలీవుడ్‌లోని పాపులర్ హీరోయిన్స్‌లో పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ నటి స్కూబా డైవింగ్ (Scuba Diving) అంటే చాలా ఇష్టం...

సముద్రంలో చెత్త ఏరిన బాలీవుడ్ బ్యూటీ Parineeti Chopra.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్‌లోని పాపులర్ హీరోయిన్స్‌లో పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ నటి స్కూబా డైవింగ్ (Scuba Diving) అంటే చాలా ఇష్టం. అందుకే ఎంతో ఇంట్రస్ట్‌తో ఈ బ్యూటీ స్కూబా డైవింగ్‌లో శిక్షకురాలి సర్టిఫికెట్ కూడా పొందింది. అంతేకాకుండా వీలు కుదిరినప్పుడల్లా సముద్రంలో డైవింగ్ చేస్తుంటుంది. ఈ భామ తాజాగా ఓ గొప్ప పని చేసి అభిమానులు, నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది.


పరిణీతి సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసింది. అందులో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోని చెత్తని సేకరించింది. అంతేకాకుండా.. ఆ వీడియోకి.. ‘సరదా డైవింగ్ చేశాను. అలాగే చెత్తను సేకరించడం ద్వారా ఓ మంచి పని చేయగలిగా. సముద్రాన్ని క్లీన్ చేయడానికి నాతో చేరండి’ అంటూ ఈ భామ క్యాప్షన్ రాసుకొచ్చింది. అంతేకాకుండా.. ఆ వీడియోలో సైతం..‘ప్రతి సంవత్సరం దాదాపు 14 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో పడుతోంది. 2050 నాటికి దీనికి నాలుగు రెట్ల ప్లాస్టిక్ సముద్రంలో చేరుతుందని అంచనా. దీని వల్ల వేలాది సముద్ర జీవజాతులు అంతరించిపోయే అవకాశం ఉంది. వాటిలో కొన్ని రకాల సముద్ర తాబేళ్లు, డాల్ఫిన్లు, సీల్స్ ఉన్నాయి. అదృష్టవశాత్తూ.. ‘డైవ్ ఎగైనెస్ట్ డెబ్రిస్’ ద్వారా పలువురు డైవర్లు సముద్రంలోని ఈ చెత్తని తీసేస్తూ, ఈ జాతులను రక్షించడంలో సహాయపడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి 90వేల మంది డైవర్లు సముద్రంలో నుంచి దాదాపు 2 మిలియన్ల చెత్త ముక్కలను తొలగించారు. కాలుష్యం నుంచి సముద్రాన్ని రక్షించడంలో నా వంతు సహాయం చేసినందుకు సంతోషంగా ఉంది’ అని పరిణీతి చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు ఈ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


‘పరిణీతి మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది’ అని కొందరు.. ‘మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు’ అని మరికొందరు.. ‘సూపర్, మరికొందరు సూపర్‌స్టార్స్ కూడా ఇలాంటి పనులు చేసి.. భూమిని రక్షించేందుకు అందరికీ అవగాహన కల్పించాలి’ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పరిణీతి ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీతో కలిసి ఉంఛై అనే మూవీలో నటిస్తోంది. అలాగే.. గాయకుడు, నటుడు హార్డీ సంధుతో కలిసి యాక్షన్ థ్రిల్లర్‌ చేస్తోంది.Updated Date - 2022-06-19T18:27:35+05:30 IST

Read more