సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గర్ల్‌ఫ్రెండ్‌తో చేతిలో చేయి వేసి కనిపించిన హృతిక్ రోషన్.. కంగనానే బెటర్ అంటూ..

ABN, First Publish Date - 2022-04-06T14:57:26+05:30

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో హృతిక్ రోషన్-సబా ఆజాద్ జంట ఒకటి. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో హృతిక్ రోషన్-సబా ఆజాద్ జంట ఒకటి. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. అంతేకాకుండా చాలాసార్లు వారిద్దరూ కలిసి బయట మీడియా కంటపడ్డారు. తాజాగా సైతం ఎయిర్‌పోర్ట్‌లో ఈ జంట మీడియా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


అందులో.. హృతిక్, సభా చేతులు పట్టుకొని ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వస్తూ కనిపించారు. దీంతో ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ జంటని పొగుడుతూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. కొందరైతే హృతిక్ సెలెక్షన్ బాలేదని.. సభా కంటే కంగనానే చాలా బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


అయితే.. భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత హృతిక్ రోషన్ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌తో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాడు. అయితే అది ఎక్కువ కాలం నిలవలేదు. తొందరగానే వీరిద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే బ్రేకప్ తర్వాత కంగనా, హృతిక్‌ల మధ్య మాటల యుద్ధమే నడిచింది. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ అప్పటి నుంచి సింగిల్‌గా ఉన్న ఈ యంగ్ హీరో ఇటీవలే నటి సభా ఆజాద్‌తో డేటింగ్ ప్రారంభించాడు. కాగా.. వారిద్దరి ఎంగేజ్‌మేంట్ కూడా అయిపోయినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..

Updated Date - 2022-04-06T14:57:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!