Kapil Sharma షో ను చూడటానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన అభిమాని
ABN , First Publish Date - 2022-06-27T22:13:34+05:30 IST
బాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కపిల్ శర్మ(Kapil Sharma). కామెడీ షోలతో దేశ వ్యాప్తంగా అందరికి చేరువయ్యారు. 2007లో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’(The Grea

బాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కపిల్ శర్మ(Kapil Sharma). కామెడీ షోలతో దేశ వ్యాప్తంగా అందరికి చేరువయ్యారు. 2007లో ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’(The Great Indian Laughter Challenge)షో విజేతగా నిలిచారు. అనంతరం ‘కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ’(Comedy Nights With Kapil Sharma) టాక్ షోను హోస్ట్ చేశారు. ఈ షో విజయవంతం కావడంతో స్టార్ కమెడియన్‌గా మారారు. ఆ తర్వాత పలు కామెడీ షోలతో ప్రేక్షకులను అలరించారు. కపిల్ తాజాగా కెనడాలో కన్సర్ట్ నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి థ్యాంక్ యూ. మీ నగరం ఎంత స్వచ్ఛంగా ఉందో, అంత స్వచ్ఛంగా మీరు ఉన్నారు’’ అని కపిల్ శర్మ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ టాక్ షోను చూడటానికి ఓ అభిమాని ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావడం చెప్పుకోదగ్గ విశేషం. ‘మీకు అతిపెద్ద అభిమానిని’ అనే ఫ్లకార్డును ఆయన చేతిలో పట్టుకున్నారు. కపిల్ పెట్టిన పోస్ట్‌కు అనేక మంది సెలబ్రిటీలు రిప్లై ఇచ్చారు.
గతంలో వాంకోవర్ నుంచే కపిల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎయిర్ పోర్టులో ఓ అభిమానితో జరిగిన సంభాషణను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ‘‘నా గురించి, నా షో గురించి మీకెలా తెలుసు’’ అని కపిల్ అడిగారు. ‘‘యూట్యూబ్ లో మీ షోలను చూస్తాను’’ అని ఆ అభిమాని సమాధానమిచ్చారు. కపిల్ శర్మ ఈ కన్సర్ట్లోనే ఇటీవల మరణించిన సింగర్స్ సిద్ధూ మూసేవాలా, కెకెలకు నివాళులు అర్పించారు. కపిల్ గతంలో అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించారు. ‘ఫిరాంగి’, ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’, ‘ఇట్స్ మై లైఫ్’ వంటి చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం నందితా దాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అతి త్వరలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.