సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger: ట్రెండ్ అవుతున్న Vijay Deverakonda కొత్త పోస్టర్.. Hottest man alive అంటూ..

ABN, First Publish Date - 2022-07-03T16:38:13+05:30

టాలీవుడ్‌లో క్రేజీ నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ‘పెళ్లి చూపులు’తో హీరోగా మారిన ఈ నటుడు ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారిగా స్టార్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌లోని క్రేజీ నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ‘పెళ్లి చూపులు’తో హీరోగా మారిన ఈ నటుడు ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారిగా స్టార్‌గా అయిపోయాడు. సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ఈ యువ నటుడు తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ కొత్త పోస్టర్‌ని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. అందులో విజయ్ దేవరకొండ బట్టలు లేకుండా ఉన్నాడు. ఆ పోస్టర్‌పై సాలా క్రాస్‌బ్రీడ్ అని కూడా రాసుకొచ్చారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఇది రిలీజైన కొద్దిగంటల్లోనే పది లక్షలకిపైగా లైకులు సాధించడం విశేషం. దీనిపై విజయ్.. ‘ఈ సినిమా నాకు చాలా ఇచ్చింది. నటనపరంగా, మానసికంగా, శారీరకంగా నేను చేసిన ఛాలెంజింగ్ రోల్ ఇదే’ అంటూ కామెంట్ చేశాడు.


ఈ పోస్టర్ విడుదల తర్వాత సినిమా విడుదల కాకముందే విజయ్ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఎంతోమంది ఆయన అభిమానులు విజయ్ ‘Hottest man alive’ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. అందులో.. ‘విజయ్ దేవరకొండ క్రేజ్ ఎవరూ ఊహించనిది. ఆయన ఒక సూపర్ స్టార్. ఇండియాలోనే హటెస్ట్ మ్యాన్’ అని ఓ నెటిజన్.. ‘విజయ్ ఎంతో మంది హృదయాలను కొల్లగగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు’ అని ఇంకో నెటిజన్.. ‘హటెస్ట్ మ్యాన్.. ఈ పోస్టర్ చూసిన తర్వాత నా రియాక్షన్ ఇదే’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే.. ఈ సినిమాని బాలీవుడ్ మూవీ మేకర్ కరణ్ జోహార్‌తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీలోనూ విడుదలకానుంది.



















Updated Date - 2022-07-03T16:38:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!