సోషల్ మీడియాకు బ్రేకిచ్చిన Shilpa Shetty.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2022-05-12T23:25:00+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నబాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి (Shilpa Shetty). అభిమానులకు చేరువ కావడానికీ ఎల్లప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటుంది.

సోషల్ మీడియాకు బ్రేకిచ్చిన Shilpa Shetty.. ఎందుకంటే..?

అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి (Shilpa Shetty). అభిమానులకు చేరువ కావడానికీ ఎల్లప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటుంది. కుటుంబం, పిల్లలు, వర్కౌట్‌‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. ఏమైందో తెలియదు కానీ శిల్పా నెటిజన్లకు షాకిచ్చింది. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లకు టాటా చెబుతున్నట్టు మే 12న తెలిపింది. బ్లాక్ ఫొటోను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. ‘‘మార్పులేకుండా ఒకే విధమైన పిక్స్ పోస్ట్ చేయడంతో విసుగు చెందాను. ప్రతి పోస్ట్ ఒకే విధంగా కనిపిస్తుంది. కొత్తదనం కనిపించే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను’’ అని శిల్పాశెట్టి రాసుకొచ్చింది.  


శిల్పాశెట్టి త్వరలోనే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ (Indian Police Force) అనే వెబ్‌సిరీస్‌లో ఆమె నటిస్తుంది. ఈ షోలో సిద్దార్థ్ మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రోహిత్ శెట్టి (Rohit Shetty) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్‌లో లేడీ కాప్‌గా కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా ఓ రొమాంటిక్ కామెడీతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ అందాల భామ ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా మారిందీ. విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్‌క్స్) బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. వీఎఫ్‌ఎక్స్‌తో ఒక సినిమా రూపు రేఖలే మార్చవచ్చని  తెలిపింది.  ప్రొడక్షన్ హౌస్‌లకు ప్రపంచస్థాయి నాణ్యతతో సేవలు అందించడమే  లక్ష్యమని వివరించింది. Updated Date - 2022-05-12T23:25:00+05:30 IST

Read more