సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వైరల్ వీడియోలో.. ప్రియాంక చోప్రాతో కలిసి హారతినిచ్చిన మహిళ ఎవరో తెలుసా..?

ABN, First Publish Date - 2022-01-08T23:35:18+05:30

అందం, అభినయంతో సరిహద్దులను చెరిపేసిన నటి ప్రియాంక చోప్రా. గత ఏడాది దీపావళి సందర్భంగా లాస్ ఏంజిలిస్‌లోని తన ఇంటిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందం, అభినయంతో సరిహద్దులను చెరిపేసిన నటి ప్రియాంక చోప్రా. గత ఏడాది దీపావళి సందర్భంగా లాస్ ఏంజిలిస్‌లోని తన ఇంటిలో లక్ష్మీ పూజ చేసింది. లక్ష్మీ పూజ చేస్తున్నప్పుడు ఒక మహిళతో కలిసి హారతినిచ్చింది. ఆ వీడియో నెట్టింట  వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని మహిళ గురించి అందరు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ మహిళ సామి ఉడెల్ అని తెలుస్తోంది. లాస్ ఏంజిలిస్‌లో సెలెబ్రిటీలకు చెఫ్‌గా ఆమె సేవలను అందిస్తుంది. ప్రియాంక చోప్రా, సామి ఉడెల్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని  మీడియా తెలుపుతోంది. ప్రియాంకను వోగ్ మ్యాగజైన్ కిచ్చిన ఇంటర్వ్యూలో సామి ఉడెల్ మెచ్చుకుంది. 


ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఫ్యామిలీలో భాగం కావడం ఎంతో సంతోషకరమని సామి ఉడెల్ చెప్పింది. ఆ కుటుంబంలో సభ్యురాలిని కావడం తన అదృష్టమని పేర్కొంది. ‘‘ ప్రియాంక నా మీద చూపే ప్రేమను మాటల్లో వర్ణించలేను. ఆ ప్రేమ గురించి లక్షల పుస్తకాలు రాయాలి. ఆమెది చాలా కష్టపడే మనస్తతత్వం. తన చుట్టు ఉండే ప్రతి ఒక్కరిపై ఆమె శ్రద్ద తీసుకుంటుంది. భారతీయ ఆహారం గురించి ప్రియాంక చోప్రా  నాకు ఎన్నో విషయాలు నేర్పించింది. ప్రియాంక తల్లి మధు చోప్రా నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ’’ అని ఆ ఇంటర్వ్యూలో సామి ఉడెల్ పేర్కొంది. గతంలో సామి ఉడెల్ అనేక మంది సెలెబ్రిటీలకు చెఫ్‌గా పనిచేసింది.

Updated Date - 2022-01-08T23:35:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!