సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Panchayat సిరీస్‌లో ప్రధాన పాత్రధారి Jitendra Kumar.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటాడో తెలుసా..?

ABN, First Publish Date - 2022-05-29T00:52:15+05:30

ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసినప్పటికి నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి జితేంద్ర కుమార్ (Jitendra Kumar). ‘గోన్ కేష్’, ‘చమన్ బహార్’, ‘జాదుగర్’, ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసినప్పటికి నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి జితేంద్ర కుమార్ (Jitendra Kumar). ‘గోన్ కేష్’, ‘చమన్ బహార్’, ‘జాదుగర్’, ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ వంటి సినిమాలతో అభిమానులను అలరించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన ‘పంచాయత్’(Panchayat) వెబ్ సిరీస్‌తో ఫేమ్‌ను సంపాదించుకున్నాడు. ఫూలేరా గ్రామ పంచాయతీ నేపథ్యంలో ‘పంచాయత్’ షో కొనసాగుతుంది. జితేంద్ర కుమార్ ఈ వెబ్ సిరీస్‌లో అభిషేక్ త్రిపాఠీ (Abhishek Tripathi) పాత్రలో అభిమానులకు కనిపించాడు. అతడు ఫూలేరా పంచాయతీకీ సెక్రెటరీగా పనిచేస్తుంటాడు. తాజాగా రెండో సీజన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్‌లో కూడా అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. జితేంద్ర కుమార్ ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు లక్షల్లోనే రెమ్యునరేషన్ తీసుకున్నాడని బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.  


జితేంద్ర కుమార్ ‘పంచాయత్-2’ లో నటించేందుకు భారీగా ఛార్జ్ చేశాడట. ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 50వేల వరకు పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లకు గాను రూ. 4లక్షలను రెమ్యునరేషన్‌గా తీసుకన్నాడని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘పంచాయత్’ వెబ్ సిరీస్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. దీపక్ మిశ్రా దర్శకత్వం వహించాడు. నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ కీలక పాత్రలు పోషించారు.


Updated Date - 2022-05-29T00:52:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!