ఒక్క పాట పాడితే Singer KK తీసుకునేది ఎంత..? ఆయనకు మొత్తం ఎంత ఆస్తి ఉందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-06-01T21:04:49+05:30 IST

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లోను పాటలు ఆలపించి ఫేమ్ సంపాదించుకున్న సింగర్ కృష్ణకుమార్ కున్నత్ (Krishna Kumar Kunnath) (కేకే)(KK). 200కు పైగా హిందీ పాటలను

ఒక్క పాట పాడితే Singer KK తీసుకునేది ఎంత..? ఆయనకు మొత్తం ఎంత ఆస్తి ఉందో తెలిస్తే..

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లోను పాటలు ఆలపించి ఫేమ్ సంపాదించుకున్న సింగర్ కృష్ణకుమార్ కున్నత్ (Krishna Kumar Kunnath) (కేకే)(KK). 200కు పైగా హిందీ పాటలను పాడారు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’(Hum Dil De Chuke Sanam) లో ‘తడప్ తడప్’ (Tadap-Tadap) పాట ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌లోను ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’, ‘ఉప్పెనంత’ వంటి హిట్ సాంగ్స్ ఆలపించారు. స్టార్ సింగర్ మరణవార్త విని ఎంతోమంది అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన ఓ కళాశాల ఫెస్ట్‌లో ప్రదర్శన ఇస్తుండగా మే 31న అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికీ తరలించగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేకే ఒక్కో పాటను పాడేందుకు లక్షల్లోనే రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఆయనకు ఆస్తిపాస్తులు కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఓ సారి వాటిపై లుక్కేద్దామా.. 


ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్(కేకే) సాదా, సీదాగానే జీవించేవారు. కానీ, ఆయనకు కార్స్ అంటే చాలా ఇష్టం. అందువల్ల విలాసవంతమైన  లగ్జరీ కార్లకు తన గ్యారేజీలో చోటు ఇచ్చారు. మెర్సిడెస్ బెంజ్ ఏ క్లాస్, ఆడి ఆర్‌ఎస్-5, చెరోకీ జీప్స్ వంటి వాటిని కొనుగోలు చేశారు. కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుండటంతో అనేక సూపర్ హిట్ సాంగ్స్‌ను పాడారు. అందువల్ల ఆయన ఆస్తి(Asset) విలువ కోట్లల్లోనే ఉంటుందని తెలుస్తోంది. ఒక్కో పాటను ఆలపించేందుకు రూ. 5లక్షల నుంచి రూ. 6లక్షల వరకు పారితోషికంగా తీసుకునేవారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. లైవ్ కన్సర్ట్‌లు కూడా ఇచ్చేవారు. ఒక్కో కన్సర్ట్ ఇచ్చేందుకు రూ. 10లక్షల నుంచి రూ. 15లక్షల వరకు రెమ్యునరేషన్‌గా తీసుకునేవారు. ఆయన ఆస్తుల విలువ దాదాపుగా రూ. 50కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కొన్ని విలువలను తప్పకుండా పాటించేవారు. పెళ్లి ఫంక్షన్‌లో పాట పాడేందుకు ఆయనకు రూ. 1కోటిని ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ, ఆ ఆఫర్‌‌ను ఆయన అంగీకరించలేదు. సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. కానీ, పాడటం తప్ప ఏ ఇతర విషయాలు నచ్చవని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. సింగర్ కేకేకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Updated Date - 2022-06-01T21:04:49+05:30 IST

Read more