సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aryan Khan నుంచి Janhvi Kapoor వరకు.. ఈ 8 మంది Bollywood star kids విద్యార్హతలు ఏంటో తెలిస్తే..

ABN, First Publish Date - 2022-05-31T01:00:12+05:30

బాలీవుడ్ స్టార్స్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో వారి వారసులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఈ స్టార్ కిడ్స్ ఎక్కడికి వెళ్లిన బీ టౌన్ మీడియా వారిని వెంబడిస్తుంటుంది. ఫొటోలతో క్లిక్ మనిపిస్తుంటుంది. స్టార్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్స్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో వారి వారసులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఈ స్టార్ కిడ్స్ ఎక్కడికి వెళ్లిన బీ టౌన్ మీడియా వారిని వెంబడిస్తుంటుంది. ఫొటోలతో క్లిక్ మనిపిస్తుంటుంది. స్టార్స్ వారసులు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, అనన్య పాండే ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమ నటనతో ప్రేక్షకులను ఆకటుకున్నారు. సుహానా ఖాన్, ఖుషి కపూర్‌ల బాలీవుడ్ ఎంట్రీ కూడా ఖాయమైంది. జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న ‘ద అర్చీస్’ ప్రాజెక్టుతో వీరిద్దరు తెరపై మెరవనున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ కిడ్స్ విద్యార్హతలపై ఓ లేక్కేద్దామా.. 


ఆర్యన్ ఖాన్ (Aryan Khan): 

షారూఖ్ ఖాన్ పెద్ద కుమారుడే ఆర్యన్ ఖాన్. లండన్‌లోని సెవెనోక్స్ హై స్కూల్ నుంచి చదువును పూర్తి చేశాడు. యూనివర్శిటీ ఆఫ్ సౌతార్న్ కాలిఫోర్నియా నుంచి ఉన్నత విద్యను అభ్యసించాడు. 


నవ్య నవేలీ నందా (Navya Naveli Nanda):

అమితాబ్ బచ్చన్ మనవరాలే నవ్య నవేలీ నందా. లండన్‌లోని సెవెనోక్స్ హై స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. డిజిటల్ టెక్నాలజీ ప్రధాన సబ్జెక్టుగా 2020లో ఫోర్దమ్ యూనివర్శిటీ నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది. 


ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan):

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల కొడుకే ఇబ్రహీం అలీఖాన్. ఇబ్రహీం పాఠశాల విద్యను ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పూర్తి చేశాడు. లండన్‌లోని బోర్డింగ్ స్కూల్ నుంచి ఉన్నత విద్యను అభ్యసించాడు.  


ఖుషీ కపూర్ (Khushi Kapoor):

బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్, శ్రీదేవిల చిన్న కుమార్తె ఖుషీ కపూర్. ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి స్కూలింగ్‌ను పూర్తి చేసింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి యాక్టింగ్ కోర్సును అభ్యసించింది. 


అనన్య పాండే (Ananya Panday):

బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురే అనన్య పాండే. ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి స్కూలింగ్‌ను పూర్తి చేసింది. లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సౌతార్న్ కాలిఫోర్నియా నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది. 


సుహానా ఖాన్ (Suhana Khan): 

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూతురే సుహానా ఖాన్. ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించింది. న్యూయార్క్ యూనివర్శిటీ టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌ నుంచి ఉన్నత విద్యను పూర్తి చేసింది. 


జాన్వీ కపూర్ (Janhvi Kapoor):

బోనీ కపూర్, శ్రీదేవిల పెద్ద కూతురే జాన్వీ కపూర్. ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. లాస్ ఏంజెల్స్‌లోని లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ యూనివర్శిటీ నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది. 


సారా అలీ ఖాన్ (Sara Ali Khan):

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కూతరే సారా అలీ ఖాన్. ముంబైలోని బీసెంట్ మాంటిస్సోరి స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించింది. న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్శిటీ నుంచి ఉన్నత విద్యను పూర్తి చేసింది. 

Updated Date - 2022-05-31T01:00:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!